Shravan Kumar: మంత్రి విశ్వరూప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం..
ABN, First Publish Date - 2023-04-08T10:17:02+05:30
కోనసీమ అల్లర్ల కేసు ఉపసంహరించుకునే నిర్ణయంపై మంత్రి విశ్వరూప్ (Minister Vishwaroop) చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని జై భీమ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ (Jada Shravan Kumar) అన్నారు.
అమరావతి: కోనసీమ అల్లర్ల కేసు (Konaseema Riots Case) ఉపసంహరించుకునే నిర్ణయంపై మంత్రి విశ్వరూప్ (Minister Vishwaroop) చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని జై భీమ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ (Jada Shravan Kumar) అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తప్పు చేసిన వారు తప్పించుకున్నారని, అమాయకుల్ని పోలీసులు అరెస్టు చేశారని మంత్రి చెప్పటం సిగ్గుచేటన్నారు. కేసులు ఉపసంహరించుకునే నెపంతో అరెస్టు చేసిన వారందరూ అమాయకులనే నాటకానికి తెరలేపారన్నారు.
కోనసీమ అల్లర్ల కేసులో పోలీసులు వైఫల్యం చెందారని అనటం పూర్తిగా ఈ ప్రభుత్వ పరిపాలన అసమర్థతకు నిదర్శనమని జడ శ్రవణ్ కుమార్ అన్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టిన సందర్భంగా చెలరేగిన అల్లర్ల కేసులను ప్రభుత్వం ఉపసంహరిస్తే రాష్ట్రం రావణ కాష్టమవుతుందని.. కోటి యాభై లక్షల మంది దళితులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తారని శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు.
Updated Date - 2023-04-08T10:38:28+05:30 IST