జగన్ హామీలు నీటి మూటలు
ABN, First Publish Date - 2023-12-02T01:02:55+05:30
ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీలు నీట మూటలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తుమ్మలపల్లి హరికృష్ణ విమ ర్శించారు. కంకిపాడులోని 172వ బూత్‌లో నిర్వహిం చిన బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్ర మంలో ఆయన పాల్గొన్నారు.
బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తుమ్మలపల్లి హరికృష్ణ
కంకిపాడు, డిసెంబరు 1 : ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీలు నీట మూటలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తుమ్మలపల్లి హరికృష్ణ విమ ర్శించారు. కంకిపాడులోని 172వ బూత్‌లో నిర్వహిం చిన బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్ర మంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరి కృష్ణ మాట్లాడుతూ, 2019 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీలు నీట మూటలే అన్నారు. మద్యపాన నిషేధమన్నారని, కాని నేడు వాడ వాడలా మద్యం దుకాణాలు వెలిశాయని, అదే విధంగా సందు సందు కు బెల్టు షాపులు దర్శినమిస్తున్నాయని విమర్శిం చారు. అత్యధికంగా ఎంపీ స్థానాలు ఇస్తే పోలవరం, ప్రత్యేక హోదాలను తీసుకు వస్తానన్న జగన్ హామీ ఏమైందన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే విస్మరించారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్లీ సీఎంగా చందబ్రా బు నాయుడు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పులి శ్రీనివాసరావు, కొండా నాగేశ్వరరావు, గోగినేని వెంకటరమణ, ఏనుగ జయప్రకాష్, సలీం తదితరులు పాల్గొన్నారు.
యనమలకుదురులో..
పెనమలూరు : నవ్యాంధ్ర భవిష్యత్తుకు భరోసా చంద్రబాబు మాత్రమేనని, రాష్ట్ర భవిష్యత్తును కాలరాసిన జగన్‌రెడ్డిని ఓడించి తిరిగి చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా పట్టం కట్టాలని టీడీపీ నాయకులు అనంతనేని చంద్రశేఖరాజాద్, బలగం నాగరాజు, తమ్ము అశోక్ పేర్కొన్నారు. శుక్రవారం యనమలకుదురులోని వివిధ డివిజన్లలో జరిగిన బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు మేనిఫెస్టోలోని అంశాలను వివరించి అది ముఖ్యంగా మహిళల సమగ్రాభివృద్ధికి ఏవిధంగా ఉపయోగపడుతుందో వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బోడె ప్రసాద్‌ను ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కళ్యాణపు శ్రీనివాస్, గండికోట శ్రీను, వెలగపూడి శేఖర్, మాచిన శివ, బూక్యా రాజా, తాడిశెట్టి వీరాస్వామి, మహిళాశక్తి మల్లంపాటి విజయలక్ష్మి, మేడసాని రత్నకుమారి పాల్గొన్నారు.
ఇంద్రనగర్ పుట్టరోడ్డులో..
ప్రభుత్వ అవినీతిని, అక్రమాలను ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలపై పెడుతున్న కేసులను లెక్క చేయరని యనమలకుదురు టీడీపీ నేతలు శొంఠి శివరాంప్రసాద్, కొక్కిలిగడ్డ సంగీతరావు, పొన్నాల సాయికుమార్ పేర్కొన్నారు. శుక్రవారం యనమలకుదురు ఇంద్రనగర్ పుట్టరోడ్డులో జరిగిన భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో వారు పాల్గొని స్థానికులతో మాట్లాడారు. టీడీపీ శ్రేణులు, సానుభూతిపరులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటికి తిరిగి టీడీపీ మేనిఫెస్టోతో ప్రతి ఇంటికి వచ్చే లబ్ధితో కూడిన బాండ్లను పంపిణీ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బోడె ప్రసాద్‌ను, ముఖ్యమంత్రి గా చంద్రబాబును ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
Updated Date - 2023-12-02T01:02:57+05:30 IST