Pawan Kalyan: మంగళగిరి సభలో పేలనున్న పవన్ పంచ్‌లు.. ఈనెల 11 నుంచి జనసేనాని బిజీబిజీ
ABN, First Publish Date - 2023-03-10T11:37:43+05:30
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 11 నుంచి బిజీబిజీగా గడపనున్నారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ఈనెల 11 నుంచి బిజీబిజీగా గడపనున్నారు. 11 నుంచి 14 వరకు రాజకీయ సమావేశాలు, కార్యకర్తలతో పవన్ (Janasena Chief) భేటీ అవుతూ బిజీగా ఉండనున్నారు. జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనసేనాధిపతి పలు ముఖ్య సమావేశాలు, సమీక్షలు చేయనున్నారు. 11న మంగళగిరిలో పార్టీ కార్యాలయానికి రానున్న పవన్.. మధ్యాహ్నం 2 గంటలకు బీసీ సంక్షేమంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. 12న ఉదయం 11 గంటలకు పార్టీ రాష్ట్ర నాయకులతో సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య నేతృత్వంలో కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో పవన్ భేటీ కానున్నారు.
13న ఉదయం 11గంటలకు ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష జరుపుతారు. సాయంత్రం 5 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌తో పవన్ మర్యాదపూర్వకంగా కలువనున్నారు. 14 మధ్యాహ్నం 1 గంటకు మంగళగిరి పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి వారాహి వాహనంలో మచిలీపట్నం సభకు బయలుదేరనున్నారు. 2 గంటలకు ఆటోనగర్ గేట్ దగ్గర పవన్‌కు జనసేన నేతల స్వాగతం పలుకనున్నారు. తాడిగడప జంక్షన్, పోరంకి జంక్షన్, పెనమలూరు జంక్షన్, పామర్రు – గుడివాడ సెంటర్ (బైపాస్ దగ్గర) మీదుగా 5 గంటలకు మచిలీపట్నంలో జనసేన పదో ఆవిర్భావ సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. జనసేన భవిష్యత్తు కార్యాచరణ, వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలనును ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ పంచ్‌లను పేల్చనున్నారు.
Updated Date - 2023-03-10T11:44:30+05:30 IST