ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pawankalyan: మెడికో ప్రీతి మరణం అత్యంత బాధాకరం

ABN, First Publish Date - 2023-02-27T10:22:01+05:30

పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి మరణం అత్యంత బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి (Dr. Preeti is a PG medical student) మరణం అత్యంత బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీతికి నివాళి అర్పిస్తూ సోమవారం పవన్‌ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచిన డాక్టర్ ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక డాక్టర్ ప్రీతి బలవన్మరణానికి పాల్పడ్డ పరిస్థితులు, కన్నవారి మానసిక వేదన గురించి తెలుసుకొంటే హృదయం ద్రవించిందన్నారు. తమ బిడ్డను సైఫ్ వేధిస్తూ, కించపరుస్తూ ఉన్నాడని తల్లితండ్రులు ఫిర్యాదు చేసిన వెంటనే కాలేజీ యాజమాన్యం బాధ్యులపై సరైన రీతిలో స్పందించి ఉంటే ఇటువంటి దురదృష్టకర పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు.

డాక్టర్ ప్రీతి ఆత్మహత్యకు కారకుడైన నిందితుడికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళాశాలల్లో ర్యాగింగ్, వేధింపులు అరికట్టడంపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభించాలన్నారు. సీనియర్ విద్యార్థుల ఆలోచన ధోరణి మారాలని సూచించారు. కొత్తగా కాలేజీలోకి అడుగుపెట్టిన వారిని స్నేహపూర్వకంగా అక్కున చేర్చుకుని తమ కుటుంబ సభ్యుల్లా ఆదరించాలని యువతకు పవన్‌ కళ్యాణ్ హితవు పలికారు.

ప్రీతి కన్నుమూత..

వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజీ(కేఎంసీ) (Kakatiya Medical College(KMC))కి చెందిన పీజీ మొదటి సంవత్సరం(అనస్థీషియా) విద్యార్థిని ధారావత్‌ ప్రీతి కథ విషాదాంతంగా ముగిసింది. ఐదు రోజులుగా హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన ఆమె ఆదివారం రాత్రి 9.10 గంటలకు తుదిశ్వాన విడిచారు. డాక్టర్ల బృందం ఆమెను కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఎంజీఎం అనస్థీషియా విభాగంలో పని చేస్తున్న ప్రీతి తన సీనియర్‌ ఎంఏ సైఫ్‌ వేధింపులు భరించలేక ఈనెల 22న ఉదయం మత్తు ఇంజక్షన్‌ తీసుకుంది.

అత్యవసర ఆపరేషన్‌ థియేటర్‌లో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెకు ఎంజీఎంలోనే చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో అదే రోజు నిమ్స్‌కు తరలించారు. అప్పటికే ఆమె గుండె పనితీరు మందగించడంతో ఎంజీఎంలో సీపీఆర్‌ నిర్వహించారు. హైదరాబాద్‌కు తరలించిన తర్వాత రెండుసార్లు నిమ్స్‌ వైద్యులు కూడా సీపీఆర్‌ చేశారు. నిమ్స్‌లో చేరినప్పటి నుంచీ ప్రీతి ఆరోగ్యం ఏ మాత్రం మెరుగుపడలేదు. ఆమె అవయవాలన్నీ దెబ్బతినడం వల్ల చికిత్సకు ఏ మాత్రం స్పందించలేకపోయాయి. ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తూ వచ్చింది. మెడికోను రక్షించేందుకు నిమ్స్ వైద్యులు యత్నించినప్పటికీ నిన్న రాత్రి ప్రీతి కన్నుమూశారు.

Updated Date - 2023-02-27T10:49:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising