ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పులిగడ్డలో జనంలోకి జనసేన ప్రారంభం

ABN, First Publish Date - 2023-06-30T01:23:43+05:30

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విధానాలను వివరించి ప్రజలను చైతన్యవంతులను చేయడమే లక్ష్యం గా జనంలో జనసేన కార్యక్రమాన్ని పులిగడ్డ వేంక టేశ్వరస్వామి ఆలయం వద్ద గురువారం ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవనిగడ్డ టౌన్‌ : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విధానాలను వివరించి ప్రజలను చైతన్యవంతులను చేయడమే లక్ష్యం గా జనంలో జనసేన కార్యక్రమాన్ని పులిగడ్డ వేంక టేశ్వరస్వామి ఆలయం వద్ద గురువారం ప్రారంభించారు. అనంతరం పులిగడ్డ గ్రామంలో గడప గడపకు తిరుగుతూ జనసేన పార్టీ విధానాలను, అధికారంలోకి వస్తే ప్రజలకు అందించే సేవలను జనసేన నాయకులు వివరించారు. రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కమిటీ కార్యదర్శి లంకే యుగంధర్‌, జిల్లా కమిటీ కార్యదర్శి గాజుల శంకరరావు, కోడూ రు, మోపిదేవి, చల్లపల్లి మండలాల పార్టీ అధ్యక్షులు మర్రె గంగయ్య, పూషడపు రత్నగోపాల్‌, చోడగం విమల్‌ కృష్ణ, సీనియర్‌ నాయకులు బచ్చు వెంకట నాథ్‌, నూకల లక్ష్మయ్య, బాదర్ల లోలాక్షుడు నాయుడు, మండలి శివప్రసాద్‌, పిట్టల్లంక, లింగారెడ్డిపాలెం, పూషడం గ్రామాల సర్పంచ్‌లు కనగాల వెంకటేశ్వరరావు, యర్రంశెట్టి శ్రీ దుర్గ, అంకం మారుతీరావు, ఎంపీటీసీలు బొప్పన భాను, కటికల వసంత్‌, వార్డు మెంబర్లు మునిపల్లి శ్రీలక్ష్మి, కమ్మిలి సాయి భార్గవ, పులిగడ్డ పార్టీ కమిటీ అధ్యక్షులు మండలి ఉదయ్‌ పాల్గొన్నారు.

రాయపూడికి బండ్రెడ్డి పరామర్శ

అవనిగడ్డ టౌన్‌, జూన్‌ 29 : ఇటీవల మాతృవియోగానికి గురైన జనసేన పార్టీ సీనియర్‌ నేత, ప్రముఖ న్యాయవాది రాయపూడి వేణుగోపాలరావును జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా అద్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ గురువారం పరామర్శించారు. రాయపూడికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు రాజనాల వీరబాబు, నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-30T01:23:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising