Kodi Kathi Case.. సీఎం తరఫు న్యాయవాది చెప్పేవన్నీ అబద్దాలే..: అబ్దుల్ సలీం
ABN, First Publish Date - 2023-08-31T13:43:48+05:30
అమరావతి: కోడికత్తి కేసులో ముఖ్యమంత్రి జగన్ తరపు న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు చెబుతున్నవన్నీ అబద్దాలేనని.. అవే అబద్దాలను సాక్షి పత్రికలో ప్రచురించారని కోడికత్తి శ్రీను తరపు న్యాయవాది అబ్దుల్ సలీం అన్నారు.
అమరావతి: కోడికత్తి కేసు (Kodi Kathi Case)లో ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) తరపు న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు చెబుతున్నవన్నీ అబద్దాలేనని.. అవే అబద్దాలను సాక్షి పత్రికలో ప్రచురించారని కోడికత్తి శ్రీను (Kodi Kathi Srinu) తరపు న్యాయవాది అబ్దుల్ సలీం (Abdul Saleem) అన్నారు. గురువారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి బొత్సా సత్యానారాయణ (Minister Bosta) మేనల్లుడి వద్ద కోడికత్తి లభించిందని.. తన క్లయింట్ వద్ద కాదని.. దానికి ఆధారాలు ఉన్నాయన్నారు. ఆనాడు ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ అక్రమంగా కరణం ధర్మశ్రీ (Karanam Dharmasri), రాజన్న దొర (Rajanna Dora), కొండా రాజీవ్ గాంధీ (Konda Rajiv Ghandi), కృష్ణకాంత్ (Krishnakanth), సుధాకర్ (Sudhakar)లను ఎయిర్ పోర్టు వీఐపీ లాంజ్‌లోకి తీసుకువచ్చారని, వారి వద్ద ఎలాంటి పాసులు, పర్మిట్‌లు లేవని, దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు.
తన కక్షిదారుకు ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని, నాలుగేళ్లుగా జగన్ రెడ్డి సిఎంగా ఉండి ఏం చేస్తున్నారని న్యాయవాది అబ్దుల్ సలీం ప్రశ్నించారు. ఇంత వరకూ ఆయన సిట్ రికార్డులను ఎన్‌ఐఏకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎన్ఐఏ జగన్ రెడ్డితో, కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కు అయ్యిందని, తన క్లయింట్‌పై అసత్య ప్రచారం చేసి అభియోగాలు మోపి.. జైలులో ఉంచారని అన్నారు. ఐదేళ్లుగా జైలులో ఉంచి బెయిల్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. దళితుడైన తన క్లయింట్‌కు ఇప్పటికైనా న్యాయం జరగాలని కోరారు. జగన్ కోర్టుకు రావాలి... అప్పుడు అతని లాయర్ చెప్పినవన్నీ అబద్దాలని నిరూపిస్తానని న్యాయవాది అబ్దుల్ సలీం స్పష్టం చేశారు.
Updated Date - 2023-08-31T13:43:48+05:30 IST