AP News: ప్రభుత్వం ఇచ్చిన నోటీసుపై కేఆర్ సూర్యనారాయణ ఏమన్నారంటే..
ABN, First Publish Date - 2023-01-23T16:10:25+05:30
విజయవాడ: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణకు సాధారణ పరిపాలన శాఖ (హెచ్‌ఆర్) నుంచి నోటీసులు (Notices) జారీ చేశారు.
విజయవాడ: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ (KR Suryanarayana)కు సాధారణ పరిపాలన శాఖ (HR హెచ్‌ఆర్) నుంచి నోటీసులు (Notices) జారీ చేశారు. దీనిపై స్పందించిన ఆయన సోమవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Governor Biswabhushan Harichandan)ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడినందుకు నోటీసులు ఇచ్చారన్నారు. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వమన్నారని, అన్ని విషయాలతో వివరణ ఇస్తామన్నారు. ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్న తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. నిబంధనలు ఒక సంఘానికే పరిమితమవుతాయా? అని ప్రశ్నించారు. నోటీసుల్లో ఆర్థికపరమైన చెల్లింపులపై షెడ్యూల్ ఇస్తే బాగుండేదన్నారు. గవర్నర్ కూడా ప్రభుత్వంలో భాగమేనని సూర్యనారాయణ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కరబాబు (Askara Babu) మాట్లాడుతూ కొన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ గుర్తింపు రద్దు చేస్తామంటే ఆనందపడుతున్నారన్నారు. భవిష్యత్తులో ఇదే పరిస్థితి వాళ్లకు కూడా ఎదురవుతుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. నిబంధనలకు లోబడే గవర్నర్‌ను కలిశామని చెప్పారు. గవర్నర్‌కు ఎటువంటి కంప్లైంట్ చేయలేదన్నారు. తమ సమస్యలను పరిష్కరించమని కేవలం విజ్ఞప్తి మాత్రమే చేశామని చెప్పారు. మీడియాతో మాట్లాడిన వారు అనేకమంది అనేక సంఘాల్లో ఉన్నారని.. వాళ్లకు నిబంధనలు వర్తించవా? అని ప్రశ్నించారు.
Updated Date - 2023-01-23T16:10:32+05:30 IST