కృష్ణవేణికి పూర్వ వైభవం
ABN, First Publish Date - 2023-02-16T00:56:44+05:30
ప్రకాశం బ్యారేజ్ వద్ద గల కృష్ణవేణి మాత విగ్రహానికి మహానాశికం పట్టీలు కలశంలకు పూర్వ వైభవాన్ని తీసుకురానున్నట్టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు అన్నారు. కృష్ణవేణి విగ్రహం మహానాశికం మరమ్మతులపై బుధవారం కలెక్టర్ దిల్లీరావు, కనకదుర్గ దేవస్థానం అధికారులతో కలిసి కృష్ణవేణి విగ్రహ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
కలెక్టరేట్, ఫిబ్రవరి 15 : ప్రకాశం బ్యారేజ్ వద్ద గల కృష్ణవేణి మాత విగ్రహానికి మహానాశికం పట్టీలు కలశంలకు పూర్వ వైభవాన్ని తీసుకురానున్నట్టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు అన్నారు. కృష్ణవేణి విగ్రహం మహానాశికం మరమ్మతులపై బుధవారం కలెక్టర్ దిల్లీరావు, కనకదుర్గ దేవస్థానం అధికారులతో కలిసి కృష్ణవేణి విగ్రహ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎ్‌స.జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా ఇటీవల గొల్లపూడి పర్యటనకు వచ్చిన సమయంలో ప్రకాశం బ్యారేజి వద్దగల కృష్ణవేణి విగ్రహం పరిసర ప్రాంతాలు, ఇంద్రకీలాద్రిపై నిర్మించిన చైనా వాలును పరిశీలించడం జరిగిందన్నారు. కృష్ణవేణి విగ్రహం మహానాశకం కలశంలు కళాహీనంగా ఉండటాన్ని గమనించి వెంటనే వాటికి మరమ్మతులు నిర్వహించి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఆదేశించారన్నారు. 1992 పుష్కరాల సందర్భంగా 30 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన కృష్ణవేణి విగ్రహం పరిసర ప్రాంతాల కట్టడాలు మరమ్మతులకు నోచుకోకపోవడం వల్ల కళావిహీనంగా మారాయన్నారు. సీఎం ఆదేశాల మేరకు ప్రముఖ శిల్పుల పర్యవేక్షణలో కనకదుర్గమ్మ దేవస్థాన నిధులు రూ.5 లక్షలతో కృష్ణవేణి విగ్రహం మహానాశకం కలశం పట్టీలు హంసలకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సత్వరం పనులు చేపట్టాలని ఆలయ ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్‌ను ఆదేశించారు. చైనా వాల్ నిర్మాణంపై నిపుణులతో పరిశీలించి ముఖ్యమంత్రికి నివేదిక సమర్పంచనున్నట్టు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఈవో డి.భ్రమరాంబ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎల్.రామ, ప్రకాశం బ్యారేజ్ జేఈ వి.దినేష్ పాల్గొన్నారు.
మాతశిశు మరణాలను నివారించాలి
కలెక్టరేట్ : గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి మెరుగైన వైద్య సహాయం అందించడం ద్వారా మాతా శిశు మరణాలను పూర్తిగా నివారించాలని కలెక్టర్ దిల్లీరావు వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా వైద్యాధికారులు, సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దిల్లీరావు మాట్లాడుతూ, మాతా శిశు మరణాల నివారణపై వైద్యాధికారులు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యాధికారులు, సిబ్బంది తమ పరిధిలో గర్భందాల్చిన మహిళలను గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, పూర్తి వైద్య సహాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు గర్భందాల్చిన స్ర్తీలను తొలి మాసాలలోనే గుర్తించి వారికి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించాలన్నారు. చిన్నారులకు సకాలంలో రోగనిరోధక టీకాలను వేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఉగాదికి 16వేల గృహ ప్రవేశాల లక్ష్యం
కలెక్టరేట్: ఉగాదికి 16 వేల సామూహిక గృహ ప్రవేశాల లక్ష్యాన్ని సాధించేందుకు అహర్నిశలు కృషి చేయాలని, లక్ష్య సాధనలో అలసత్వం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు అన్నారు. జిల్లాలో పేదల గృహ నిర్మాణాల ప్రగతిపై కలెక్టర్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్ధార్లు, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Updated Date - 2023-02-16T00:56:47+05:30 IST