ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్ని వర్గాలను దగా చేస్తున్న జగన్‌

ABN, First Publish Date - 2023-02-11T02:30:39+05:30

నవరత్నాలతోనే సంక్షేమం అంటూ కల్లబొల్లి మాటలతో అన్ని వర్గాల ప్రజలను వైసీపీ ప్రభుత్వం దగా చేస్తోందని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి వెంకట్రామ్‌(రాజా) విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చల్లపల్లి, ఫిబ్రవరి 10 : నవరత్నాలతోనే సంక్షేమం అంటూ కల్లబొల్లి మాటలతో అన్ని వర్గాల ప్రజలను వైసీపీ ప్రభుత్వం దగా చేస్తోందని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి వెంకట్రామ్‌(రాజా) విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిమ్మగడ్డలో శుక్రవారం సాయంత్రం జరిగింది. దళితవాడలో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. పలు సమస్యలను మహిళలు తెలియజేశారు. బీసీ, ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులను దారి మళ్లించటం, పంచాయతీల నిధులను దారి మళ్లించి గ్రామాల్లో అభివృద్ధి లేకుండా చేశారని మండిపడ్డారు. ధరల పెరుగుదల, చార్జీల మోతతో సామాన్యులు తల్లడిల్లుతున్నారని తెలిపారు. మం డల టీడీపీ అధ్యక్షుడు మోర్ల రాంబాబు, సర్పంచ్‌ పైడిపాముల కృష్ణకుమారి, ఎంపీటీసీ సభ్యురాలు రాజులపాటి అంకమ్మ, మాలెంపాటి శ్రీనివాసరావు, షేక్‌ నబీఘోరి, టీడీపీ నేతలు జల్లూరి ప్రసాద్‌, నిడమానూరి దిలీ్‌పకుమార్‌, మోర్ల ప్రసాద్‌, కైతేపల్లి శ్రీనివాసరావు, పరుచూరి సురేష్‌, దేవభక్తుని గోపాలకృష్ణ, మేడేపల్లి శ్రీను, జగదీష్‌, క్లస్టర్‌ ఇన్‌చార్జి మల్లంపల్లి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సహజ వనరుల దోపిడీ : వర్ల ధ్వజం

తోట్లవల్లూరు : ఉచితంగా లభించే ఇసుకను సీఎం జగన్‌ దోపిడీ వనరుగా మార్చేశారని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వర్ల కుమార్‌ రాజా విమ ర్శించారు. తోట్లవల్లూరులో గురువారం రాత్రి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఇసుక కార్మికులకు వైసీపీ ప్రభుత్వంలో పనిలేకుండా పోయిందని కుమార్‌ రాజా అన్నారు. ఇలాం టి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధం కావాలని ఆయన పిలుపు నిచ్చారు. మండల టీడీపీ అధ్యక్షుడు వీరపనేని శివరామ్‌, రాష్ట్ర టీడీపీ బీసీ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి, నెక్కలపూడి మురళీ, కళ్ళం వంశీకృష్ణారెడ్డి, వల్లూరు రాంబాబు పలువురు నాయకులు వెంకటేశ్వరరావు, వీరంకి పరశురామ్‌, గొరిపర్తి పోతురాజు, తోట సాయిబాబు తదితర నాయకులు పాల్గొన్నారు.

రైతులకు ధాన్యం బకాయిలు తక్షణం చెల్లించాలి

పామర్రు : ఖరీఫ్‌ ధాన్యం బకాయిలను తక్షణమే ప్రభుత్వం చెల్లించాలని పామర్రు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వర్ల కుమార్‌రాజా డిమాండ్‌ చేశారు. పామర్రులోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా రైతుల వద్ద ధాన్యం కోనుగోలు చేసిన ప్రభుత్వం 21 రోజుల వ్యవధిలో సొమ్ము చెల్లిస్తాన ని హామి ఇచ్చి చేతులేత్తయడంతో అప్పులు చేసి వరి కుప్పల నూర్పిడి చేసిన సన్న, చిన్న కారు రైతు లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ధాన్యం కోనుగోలు ప్రక్రియ నిలుపుదల చేయడం దుర్మార్గమన్నారు.

Updated Date - 2023-02-11T02:30:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising