ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దాం

ABN, First Publish Date - 2023-06-11T00:34:55+05:30

పేద వర్గాలపై ఆర్థిక భారాలు మోపుతూ ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో బంగాళాఖాతంలో కలిపేద్దామని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.

అరిసేపల్లిలో కార్యకర్తకు ఆర్థిక సాయం చేస్తున్న కొల్లు రవీంద్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరిసేపల్లిలో ‘భవిష్యత్‌కు గ్యారంటీ’లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం టౌన్‌, జూన్‌ 10: పేద వర్గాలపై ఆర్థిక భారాలు మోపుతూ ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో బంగాళాఖాతంలో కలిపేద్దామని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. శనివారం బందరు మండలం అరిసేపల్లిలో భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. ధాన్యానికి గిట్టుబాటు ధర రాలేదని రైతులు ఆయన వద్ద వాపోయారు. నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను అంటడంతో జీవనం కష్టంగా ఉందని, విద్యుత్‌ చార్జీల పెనుభారంగా మారాయని మహిళలు వాపోయారు. అన్ని వర్గాలకు మేలు చేసేలా టీడీపీ మేనిఫెస్టో ప్రకటించిందని, చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేద్దామని రవీంద్ర వారితో చెప్పారు. తెలుగు రైతు కృష్ణాజిల్లా అధ్య క్షుడు గోపు సత్యనారాయణ, కాగిత వెంకటేశ్వరరావు, రామ ధాని వేణు, ఇలియాస్‌ పాషా, పిప్పళ్ల కాంతారావు పాల్గొన్నారు.

బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిన ప్రభుత్వం

వైసీపీ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిందని, బీసీ కార్పొరేషన్‌ సబ్సిడీ రుణాలు రద్దు చేసిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు. శని వారం 48వ డివిజన్‌లో భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికీ పర్యటించారు. ఇస్ర్తీ చేస్తూ జీవనం గడుపుతున్న కార్మికులతో మాట్లా డారు. టీడీపీ ఆదరణ పథకం కింద బీసీలకు సబ్సిడీపై స్వయం ఉపాధికి పరికరాలు అందించిందన్నారు.

Updated Date - 2023-06-11T00:34:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising