ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అడ్డదారిలో అక్రమార్జన

ABN, First Publish Date - 2023-07-17T00:41:25+05:30

రెవెన్యూ అధికారుల అవినీతి దాహానికి సీఆర్‌డీఏనే తెల్లబోయింది. కాసులకు ఆశపడిన సదరు అధికారులు కేసరపల్లిలో మేథ ఐటీ పార్కు వెనుక ఓ విల్లాకు ఏకంగా అవినీతి ‘దారి’పరిచారు. అదేదో సొంత భూమి అన్నట్టుగా సదరు విల్లాకు వెళ్లేందుకు పులికుంట చెరువు భూమిలో 40 అడుగుల రోడ్డు వేయించారు. ఇందుకు రెవెన్యూ అధికారులు పూర్తిగా సహకరించడం వల్ల రూ.కోట్లలో ముడుపులు చేతులు మారాయని తెలుస్తోంది.

విల్లాకు వెళ్లేందుకు అక్రమంగా వేసిన 40 అడుగుల రోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పులికుంట చెరువులో నుంచి విల్లాకు 40 అడుగుల రోడ్డు

రియల్టర్‌ నుంచి రూ.కోట్లలో అందిన ముడుపులు

సీఆర్‌డీఏను ఏమార్చిన స్థానిక రెవెన్యూ అధికారులు

హైకోర్టు తీర్పు ఉన్నా కనీస చర్యలు శూన్యం

సీసీఎల్‌ఏ కార్యాలయంలోని ఓ అధికారి అండతోనే..

(ఆంధ్రజ్యోతి, విజయవాడ /గన్నవరం) : సాధారణంగా 40 అడుగుల రోడ్డు ఉంటే కానీ విల్లాకు అనుమతులు ఇవ్వరు. హైవే (ఎన్‌హెచ్‌-16) నుంచి తన విల్లాకు 20 అడుగుల రోడ్డు మాత్రమే ఉండటంతో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రియల్టర్‌ కేసరపల్లిలోని పులికుంట చెరువులో నుంచి 40 అడుగుల రోడ్డు వేసుకున్నాడు. విద్యుత్‌ లైన్లు కూడా వేశారు. ఇంకేముంది? అది సీఆర్‌డీఏ నుంచి అనుమతులు రావటానికి దారి క్లియరైంది. చెరువు భూమిలో రోడ్డు వేసి సీఆర్‌డీఏనే ఏమార్చిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా, గన్నవరంలో రెవెన్యూ అధికారుల లీలలు మాత్రం చర్చకు దారి తీస్తున్నాయి. ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు మారాయనే ఆరోపణలు వస్తున్నాయి. విల్లాలో ప్లాటే కోటి రూపాయలు చెబుతున్నారు. దీనిని బట్టి చెరువు భూమిలో రోడ్డు వేయటానికి సహకరించిన రెవెన్యూ అధికారులకు కూడా రూ.కోట్లలోనే ముడుపులు అందినట్టు తెలుస్తోంది. పులికుంట చెరువులో సాగుదారులమంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో ఈ అక్రమ రోడ్డు మార్గం వ్యవహారం బయటపడింది. పులికుంట అక్రమాల వ్యవహారం డొంక కదులుతోంది.

అంతా ‘రెవెన్యూ’ మాయ

కేసరపల్లిలో ఐటీ సెజ్‌ వెంబడి రూ.50 కోట్ల విలువ చేసే పులికుంట భూములను గన్నవరం రెవెన్యూ అధికారులు పరాఽధీనం చేస్తున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రియల్టర్‌కు చెందిన విల్లాకు దారితో పాటు మరో రియల్టర్‌ ప్లాట్లకు కొత్త దారి వేసేందుకు కూడా పులికుంట చెరువు భూములను అన్యాక్రాంతం చేసేందుకు రెవెన్యూ అధికారులే శ్రీకారం చుడుతున్నారన్న విమర్శలూ వస్తున్నాయి. ల్యాండ్‌ రికార్డుల్లో ట్యాంపరింగ్‌కు పాల్పడే ప్రయత్నాలకు హైకోర్టు కేసుతో చె క్‌ పడింది. లేదంటే ఈపాటికే పులికుంట చెరువు ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయేది. చెరువు భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదే. కానీ, విలువైన భూములు ఇలా అన్యాక్రాంతమవుతున్నా చర్యలు తీసుకోలేదంటే లాలూచీ పడినట్టే భావించాలి. ఇందుకోసం రెవెన్యూ అధికారులు సీఆర్‌డీఏనే ఏమార్చారు. స్థానిక వీఆర్వో జీవన్‌ ఇందుకు సహకరించాడు. పై నుంచి వచ్చిన ఆదేశాలను పాటించాడు. చెరువు భూముల్లో రోడ్డు వేస్తున్నారని, చర్యలు తీసుకోమని కేసరపల్లి వాసులు పదేపదే విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు.

చెరువు భూమిని సంరక్షించరా?

రూ.50 కోట్ల విలువైన పులికుంట చెరువు భూములు అన్యాక్రాంతమవుతుంటే హైకోర్టు తీర్పు ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన గన్నవరం రెవెన్యూ అధికారుల్లో కనీస స్పందన లేదు. తహసీల్దార్‌ కూడా ఏమీ పట్టించుకోలేదు. విల్లాకు వెళ్తున్న ప్రధానమైన 40 అడుగుల రోడ్డు చెరువు భూమిలో నుంచి వెళ్తోంది. ఆ భూములను సంరక్షించాల్సిన రెవెన్యూ అధికారులు, ఈ విషయాన్ని సీఆర్‌డీఏ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉన్నా అలా చేయలేదు.

సీసీఎల్‌ఏ అధికారి సహకారంతో..

ఈ వ్యవహారంలో రాష్ట్ర భూ పరిపాలనా కమిషనరేట్‌ (సీసీఎల్‌ఏ)పైనా ఆరోపణలు వస్తున్నాయి. సీసీఎల్‌ఏలో పనిచేసే ఒక అధికారి అందదండలు గన్నవరం రెవెన్యూ అధికారులకు ఉన్నాయని తెలుస్తోంది. సీసీఎల్‌ఏలోని అధికారితో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా సీసీఎల్‌ఏ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఈ వ్యవహారంపై విచారణ జరిపించాల్సిన అవసరముంది.

Updated Date - 2023-07-17T00:41:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising