ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇదేం ప్లాన్‌?

ABN, First Publish Date - 2023-04-27T00:38:14+05:30

మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న మచిలీపట్నం మాస్టర్‌ ప్లాన్‌ రాజకీయ రంగు పులుముకుంటోంది. ప్రార్థనా స్థలాలకు సంబంధించి క్రయవిక్రయాలకు అవకాశం లేకుండా చేస్తున్నారని, అక్కడ భవనాల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం లేదనే ఆరోపణల నేపథ్యంలో అటు ప్రతిపక్షం, ఇటు పాలకపక్ష నాయకులు ప్రెస్‌మీట్లు పెట్టి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఎవరి వాదనలు వారు వినిపించారు. దీంతో ఈ వివాదం ఇప్పుడు బందరులో హాట్‌ టాపిక్‌గా మారింది.

పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరిస్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దోచుకునేందుకే అంటున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల

వాస్తవం ఆధారంగానే అని ఎమ్మెల్యే పేర్ని నాని వివరణ

అభ్యంతరాలకు మే 9 వరకు గడువు

ప్రార్థనా స్థలాల క్రయ విక్రయాలపై ఆంక్షలు

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : మచిలీపట్నం మాస్టర్‌ ప్లాన్‌లో చర్చిలకు సంబంధించిన భూములను రెడ్‌మార్కులో చూపడం వల్ల క్రయ విక్రయాలు నిలిచిపోతున్నాయని ఈ నెల 24న జరిగిన స్పందనలో బెరాకా మినిస్ట్రీస్‌ ప్రతినిధి కిరణ్‌పాల్‌ కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు. మచిలీపట్నంలో కొన్ని ప్రార్థనా సంస్థలకు మినహాయింపు ఇచ్చారని సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. దీంతో ఈ అంశం ఒక్కసారిగా వివాదాస్పదంగా మారింది.

గంపగుత్తగా దోచేందుకే.. : కొల్లు రవీంద్ర

ఈ విషయంపై మాజీమంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు తమ నివాసంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మచిలీపట్నం మాస్టర్‌ ప్లాన్‌లో అధికార పార్టీ నాయకులకు ఆస్తులు ఉన్న కృష్ణా యూనివర్సిటీ పక్కనే కొంత భూమిని, పేర్ని నాని గిడ్డంగుల సమీపంలో కొంత భూమిని కమర్షియల్‌ ఏరియాగా చూపారన్నారు. మచిలీపట్నంలో ఇప్పటికే అనేక ఆస్తులను వైసీపీ నాయకులు కాజేశారని, గుంపగుత్తగా మచిలీపట్నంలో విలువైన స్థలాలను దోచే కుట్రలో భాగంగా మాస్టర్‌ ప్లాన్‌ను తమకు అనుకూలంగా రూపొందిస్తున్నారన్నారు. మచిలీపట్నం తాగునీటి సరఫరాకు సంబంధించి సరైన ప్రణాళికను చూపలేదన్నారు. మే 9వ తేదీలోగా అభ్యంతరాలుంటే చెప్పాలని చెబుతున్నారని, అయినా ప్లాన్‌లో మార్పులు చేయరని ఆయన పేర్కొన్నారు. మచిలీపట్నంలోని రత్నం హైస్కూల్‌ స్థలాన్ని అధికార పార్టీకి చెందిన ఒక కార్పొరేటర్‌ కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకే ఈ ప్రాంతాన్ని కమర్షియల్‌ ఏరియాగా చూపారన్నారు. పోర్టు వస్తే, నగర విస్తీర్ణం పెరిగితే తాగునీటి అవసరాలకు అనుగుణంగా ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదన్నారు. మాజీఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ఇండస్ట్రియల్‌ జోన్‌ను పోర్టు జరిగే ప్రాంతంలో కాకుండా పల్లెతుమ్మలపాలెంలోని భారత్‌ సాల్ట్‌ కంపెనీ వద్ద పెట్టడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలను చైతన్యవంతం చేసేందుకు త్వరలో అఖిలపక్షం ఏర్పాటు చేస్తామన్నారు. మే 9లోగా మచిలీపట్నం మాస్టర్‌ప్లాన్‌లో జరిగిన అవకతవకలపై ప్రజలతో అధిక సంఖ్యలో అభ్యంతరాలు ఇప్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.

అవగాహన లేని మాటలు : పేర్ని నాని

మచిలీపట్నం మాస్టర్‌ ప్లాన్‌ తయారీపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. మచిలీట్నంలోని రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ హాల్లో బుధవారం ఆయన ముడా అధికారులతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. బెరాకా మినిస్ర్టీస్‌కు సంబంధించిన ఆస్తులు, ప్రార్థనా స్థలాలు 1997, 2011లో తయారుచేసిన మచిలీపట్నం మాస్టర్‌ ప్లాన్‌లో రెడ్‌మార్కులోనే ఉన్నాయన్నారు. 2018లో ముడా సంస్థ హస్కానింగ్‌ డీహెచ్‌సీ అనే సంస్థతో మచిలీపట్నం మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని ఒప్పందం చేసుకుందన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలోనే ఈ ఒప్పదం జరిగిందని ఆయన తెలిపారు. ముడా ఉద్యోగులు, మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేస్తున్న సంస్థకు చెందిన ప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను పరిశీలించి గుడులు, బడులు, మసీదులు, చర్చిలు, శ్మశానవాటికలకు సంబంధించిన స్థలాలను రెడ్‌మార్కులో నమోదు చేశారని పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా చూపారు. కోనేరు సెంటర్‌ సమీపంలో ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో నడిచే కన్యకాపరమేశ్వరి ఆలయంతో పాటు గీతామందిరం, భావన్నారాయణ స్వామి గుడి ఉన్న ప్రాంతాలను రెడ్‌మార్కులోనే చూపారన్నారు. పల్లెతుమ్మలపాలెంలోని భారత్‌ సాల్ట్‌ కంపెనీకి చెందిన ఏడువేల ఎకరాలను ఇండస్ట్రియల్‌ ఏరియాగా చూపామని, అక్కడ కంపెనీ ఉంది కాబట్టి అలా చూపడంలో తప్పులేదన్నారు. నగరంలోని రత్నం హైస్కూలును మూసివేశారని, ఈ కారణంతోనే ఈ ప్రాంతాన్ని కమర్షియల్‌ ఏరియాలో చూపామన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 22 గ్రామాల పరిధిలోని 33వేల ఎకరాలను పోర్టు, అనుబంధ పరిశ్రమల కోసం సేకరించేందుకు నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం మాజీమంత్రి, మాజీ ఎంపీ గ్రహించాలన్నారు. కొనక ళ్ల నారాయణరావుకు పాతేరు గ్రామంలో 200 ఎకరాలకు పైగా భూమి ఉందని, కొల్లు రవీంద్రకు కరగ్రహారంలో భూములున్నాయని అక్కడ ఇండస్ట్రియల్‌ ఏరియాగా పెట్టమని కోరితే మాస్టర్‌ ప్లాన్‌లో మార్పు చేస్తామని పేర్ని నాని ఎద్దేవా చేశారు. అభ్యంతరాలు ఉంటే మే 9 తేదీలోగా తెలియజేయవచ్చని, మార్పులు చేస్తామన్నారు. ముడా వీసీ రాజ్యలక్ష్మి, అర్బన్‌ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ బొర్రా విఠల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-27T00:38:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising