ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Nagarjuna: ఆయనకు చంద్రబాబు, లోకేష్ ఏ మాత్ర వేశారో..

ABN, First Publish Date - 2023-02-03T15:40:17+05:30

పేదలు ఇళ్లు తాకట్టు పెట్టుకుని పిల్లలను విదేశాల్లో చదివించుకునే పరిస్థితి గతంలో ఉండేదని, జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంతో పేదల పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లి (అమరావతి): పేదలు ఇళ్లు తాకట్టు పెట్టుకుని పిల్లలను విదేశాల్లో చదివించుకునే పరిస్థితి గతంలో ఉండేదని, జగనన్న (Jagananna) విదేశీ విద్యా దీవెన పథకం (Foreign Education Scholarship Scheme)తో పేదల పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారని మంత్రి మేరుగ నాగార్జున (Minister Meruga Nagarjuna) అన్నారు. ఈ సందర్బంగా శుక్రవారం మంత్రి ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పేదల పిల్లలు ఉన్నత శిఖరాలకు వెళ్లాలని.. బంగారు భవిష్యత్తు ఉండాలని భావించి సీఎం జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. అంబేద్కర్ ఆశయం రాష్ట్రంలో నెరవేరుతోందని, పేదల పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇస్తున్నారని అన్నారు. కాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) గురించి మీడియా ప్రశ్నించగా.. కోటంరెడ్డికి ఎందుకు పుట్టిందో.. చంద్రబాబు (Chandrababu) ఆయన కుమారుడు లోకేష్ (Lokesh) ఏ మాత్ర వేశారో... తెలియదని అన్నారు.

మాజీ మంత్రికి చెప్పుల దండతో స్వాగతం..

ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) ఎవరూ చేయలేదని.. చేసి ఉంటే ఆధారాలు బయటపెట్టాలని మంత్రి మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. ట్యాపింగ్ చేశారంటే నమ్మేవారు ఎవరూ లేరన్నారు. ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) లేకపోతే ఎమ్మెల్యే కోటంరెడ్డి జీరో అని అన్నారు. కోటంరెడ్డి, చంద్రబాబు వలలో పడి మాట్లాడుతున్నారని విమర్శించారు. సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy)పై మాట్లాడే స్థాయి కోటంరెడ్డికి లేదన్నారు. కోటంరెడ్డి తెగబడి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎప్పటినుంచో ట్యాపింగ్ చేస్తున్నారన్న కోటంరెడ్డి.. ఇంత కాలం ఆగి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని మంత్రి ప్రశ్నించారు.

కోటంరెడ్డి ఊసర వెళ్లిలా మాట్లాడుతున్నారని, ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలు ఉంటే చూపించాలని మంత్రి మేరుగ నాగార్జున మరోసారి డిమాండ్ చేశారు. కోటంరెడ్డి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేశారు కాబట్టే సజ్జల.. భార్గవ్‌కు సోషల్ మీడియా ఇన్ చార్జ్ పదవి ఇచ్చారన్నారు. కోటంరెడ్డి ఎమ్మెల్యే పదవిపై చర్యలు తీసుకునే విషయంలో అవసరాన్ని బట్టి ముందుకెళతామని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు.

Updated Date - 2023-02-03T15:40:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising