ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అమ్మ దర్శనం..అతికష్టం

ABN, First Publish Date - 2023-10-16T01:10:14+05:30

దుర్గగుడిలో దసరా ఉత్సవాల తొలిరోజునే అనధికార దర్శనాలు పోటెత్తాయి. ప్రొటోకాల్‌ దర్శనాలకు వచ్చే వారిని వీఐపీ లైన్లలోకి బదలాయించడంలో కట్టు తప్పింది. ఎంట్రీ పాయింట్ల దగ్గర అనధికార దర్శనాలను కట్టడి చేసేందుకు పోలీసు, రెవెన్యూ సిబ్బందికి విధులు కేటాయించినా సమన్వయం లోపించింది. తొలిరోజునే అనధికార దర్శ నాలు సామాన్య భక్తులను తీవ్రంగా ఇబ్బందుల పాలుచేశాయి.

గంటల తరబడి నిలబడలేక క్యూలైన్లలోనే కూర్చున్న, పడుకున్న భక్తులు

దసరా ఉత్సవాల తొలిరోజే దుర్గగుడిలో పోటెత్తిన అనధికార దర్శనాలు

ఆలయంలో రద్దీ..ముందుకు కదలని క్యూలు

అమ్మవారి దర్శనానికి నాలుగు గంటల సమయం

ఇష్టానుసారంగా అనధికార దర్శనాలు చేయించిన ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీసులు

ఎంట్రీ పాయింట్ల దగ్గర కలెక్టర్‌ దిల్లీరావు, జేసీ సంపత్‌ కాపలా

ఓం టర్నింగ్‌ ఎంట్రీ పాయింట్‌ వద్ద మంత్రి కొట్టు పర్యవేక్షణ

‘సిగ్గుందా’.. అంటూ పోలీసులపై మంత్రి కొట్టు ఆగ్రహం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ /వన్‌టౌన్‌): దుర్గగుడిలో దసరా ఉత్సవాల తొలిరోజునే అనధికార దర్శనాలు పోటెత్తాయి. ప్రొటోకాల్‌ దర్శనాలకు వచ్చే వారిని వీఐపీ లైన్లలోకి బదలాయించడంలో కట్టు తప్పింది. ఎంట్రీ పాయింట్ల దగ్గర అనధికార దర్శనాలను కట్టడి చేసేందుకు పోలీసు, రెవెన్యూ సిబ్బందికి విధులు కేటాయించినా సమన్వయం లోపించింది. తొలిరోజునే అనధికార దర్శ నాలు సామాన్య భక్తులను తీవ్రంగా ఇబ్బందుల పాలుచేశాయి. మూలానక్షత్రం రోజున కనిపించే తాకిడి ఉత్సవాల తొలిరోజునే కనిపించింది. సామాన్య భక్తులు సాఫీగా దర్శనాలు చేయడానికి విధులు నిర్వర్తించాల్సిన వారు తమ విధులను విస్మరించి అనధికార దర్శ నాలకు రెడ్‌కార్పెట్‌ వేయడంతో పరి స్థితి అదుపు తప్పింది. ఉత్సవకమిటీ సభ్యులు, పోలీసులు ఇష్టానుసారం అనధికార దర్శనాలు చేయించడంతో పరిస్థితి చేయిజారింది. వినాయకుడి గుడినుంచి అమ్మ దర్శనం చేసుకునే భక్తులు కొండమీదకు రావటానికి మూడు గంటలు, ఆలయం లోపలికి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకోవా లంటే మరో గంట. మొత్తంగా ఆరు గంటలకు పైగా సమయం పడు తోంది. సామాన్యులు అవసరం లేదా? వీఐపీల సేవలో తరిస్తారా అంటూ ఉత్సవకమిటీ సభ్యులు, పోలీసులపై భక్తులు వాగ్వివాదానికి దిగారు. తిరుపతిలో లక్షలమంది వచ్చినా సాఫీగా దర్శనాలు జరుగుతాయని, అక్కడ చూసైనా బుద్ధి తెచ్చుకోవాలంటూ భక్తులు గట్టిగా అరిచారు. ఉదయం నుంచి మధ్నాహ్నం వరకు ఉత్సవ కమిటీ సభ్యులు, రోజంతా ఎంట్రీ పాయింట్ల దగ్గర విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఎడాపెడా తమ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వారికి అనధికార దర్శనాలకు అనుమతించటడం రెవెన్యూ సిబ్బంది చూసీ చూడనట్టు వదిలేయడంతో క్యూలు ముందుకు కదలలేదు.

క్యూలు కలగాపులగం

అనధికారిక దర్శనాలకు ఏఏ మార్గాలలో వస్తారో వాటన్నింటిని గేట్లకు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ దిల్లీరావు దగ్గరుండి ముందుగానే తాళాలు వేయించారు. మహామండపం దగ్గర నుంచి ఉత్సవ కమిటీ సభ్యులు అనధికార దర్శనాలకు ప్లాన్‌ చేసుకున్నారు. కలెక్టర్‌ నిర్ణయం వల్ల అదికూడా చాలావరకు భగ్నమైంది. గేట్లకు తాళాలు వేయించటంతో మహా మండపం నుంచి అనధికార దర్శనాలకు బ్రేక్‌ పడింది. దీంతో ప్రయాణికులంతా ఘాట్‌ మార్గంలో నేరుగా కొండ మీదకు వచ్చేశారు. మార్గమధ్యంలో అనధికార దర్శనాలను నివారించటానికి నాలుగు బారికేడింగ్‌ పాయింట్లు పెట్టినా అనధికార దర్శనాలను అడ్డుకోలేకపోయారు. అంచెలంచెలను దాటుకుని మరీ రావటంతో.. ఆలయంలో రద్దీ పెరిగిపోయింది. అంతరాలయం దర్శనాలను నిలుపుదల చేసినా, దేవస్థాన సిబ్బంది తీరు వల్ల అంతరాలయం వెలుపల వీఐపీల రద్దీ ఎక్కువైంది. అది శీఘ్ర దర్శనం రూ.300, రూ.500 దర్శన క్యూలపైన ప్రభావం చూపించింది. దసరా ఉత్సవాల్లో ఆగ కుండా వెళ్లే క్యూ ఉందంటే అది శీఘ్ర క్యూ మాత్రమే. ఈసారి అనధికార దర్శ నాల ప్రభావంతో శీఘ్ర దర్శనం క్యూలకు ఇబ్బంది ఏర్పడింది. క్యూలన్నీ కలగా పులగం అయిపోయాయి. రూ.500 క్యూలోకి శీఘ్ర దర్శన భక్తులు చేరారు. రూ.300 క్యూలోకి రూ.500 టికెట్‌ కొన్న భక్తులు చేరారు. ఒకానొక దశలో క్యూల లో తోసుకుంటూ ముందుకు సాగారు. సెక్యూరిటీ చేతులెత్తేయాల్సి వచ్చింది.

సాఫీ దర్శనాలకు బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ రావాలేమో!

కొండమీద అనధికార దర్శనాలను నిలువరించడం బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌కు ఇక్కడ డ్యూటీలు వేస్తే తప్ప సాధ్యం కాదేమోనన్న అభిప్రాయాలు భక్తులు వ్యక్తపరుస్తున్నారు. స్థానిక పోలీసులకు విధులు వేయటం వల్లనే ఈ సమస్య వచ్చిందని, ఇతర జిల్లాల పోలీసులకు డ్యూటీలు వేస్తే అనధికార దర్శనాలకు అవకాశం ఉండదని కొందరు, సీఆర్‌పీఎఫ్‌ వాళ్లను పెట్టాలని మరి కొందరు భక్తులు వ్యాఖ్యానించారు.

డీజీపీ ఆఫీసు కానిస్టేబుల్‌కు మంత్రి కొట్టు చీవాట్లు

దేవదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ సాయంత్రం కొండ మీదకు వచ్చారు. క్యూలలో తోపులాటలు, అనధికార దర్శనాల ప్రవేశాలను గమనించారు. క్యూల దగ్గరకు వెళ్లి భక్తులతో మాట్లాడారు. ఉదయం 11 గంటల వస్తే ఇప్పటికీ క్యూలలోనే ఉన్నామని మంత్రికి భక్తులు చెప్పారు. పోలీసులు వీఐపీల సేవలో తరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వీఐపీల పేరుతో ఎవరు పడితే వారు అనధికార దర్శనాలు చేసుకుంటున్నారని, తాము కూడా వీఐపీలమేనని క్యూలలో వెళ్లటం లేదా అని రూ.500 టిక్కెట్‌ క్యూలలోని భక్తులు వాపోయారు. దీంతో పోలీసులపై మంత్రి కొట్టు సత్యనారాయణకు చిర్రెత్తుకొచ్చింది. అక్కడే ఉన్న పోలీసులపై విరుచుకుపడ్డారు. ‘‘మీకు సిగ్గుందా..? అసలు ఎందుకు ఇక్కడ డ్యూటీ చేస్తున్నామో మీకు అర్థమవుతోందా? సమస్యలు లేకుండా చేయటానికి మీకు డ్యూటీలు వేస్తే.. సమస్యలు మీరే సృష్టిస్తారా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ ఆఫీసు నుంచి వచ్చిన కానిస్టేబుల్‌ కొంతమందిని అనధికారికంగా దర్శనం చేయించ టాన్ని గుర్తించి అతని మెడలో ఐడీ కార్డు తీసుకుని మంత్రి చీవాట్లు పెట్టారు.

ఎంట్రీ పాయింట్ల దగ్గర కలెక్టర్‌, జేసీ కాపలా

తన చాంబర్‌లో సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్న కలెక్టర్‌ దిల్లీరావు కొండమీద పరిస్థితిని, అనధికార దర్శనాలను చూసి స్వయంగా ఎంట్రీ పాయింట్ల దగ్గరకు వచ్చి నిలబడ్డారు. తానే అనధికార దర్శనాలు కాకుండా చూశారు. వచ్చిన వారంతా క్యూలలోనే వెళ్లేలా చూశారు. ఆలయం దగ్గరకు వెళ్లి క్యూలను క్రమబద్ధీక రణ చేసి, మళ్లీ బయటకు వచ్చి ఎంట్రీ పాయింట్ల దగ్గర పర్య వేక్షణ జరిపారు. మరోవైపు జాయింట్‌ కలెక్టర్‌ సంపత్‌కుమార్‌ క్యూలు ముందుకు కదలడంపై దృష్టి సారించారు. వీరిద్దరికి తోడు మంత్రి కొట్టు కూడా వచ్చి తాను ఓం టర్నింగ్‌ ఎంట్రీ పాయింట్‌ దగ్గర పర్యవేక్షణ జరిపారు. ఒక మంత్రి, ఇద్దరు ఉన్నతాధికారులు పర్యవేక్షణ జరుపుతున్నా వారిని ఏమార్చి మరీ పోలీసులు అనధికార దర్శనాలకు వదిలేశారు.

Updated Date - 2023-10-16T01:10:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising