నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
ABN, First Publish Date - 2023-03-25T01:07:20+05:30
అకాల వర్షాలకు జిల్లాలో నష్టపోయిన రైతు లను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వర రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
హనుమాన్ జంక్షన్, మార్చి 24: అకాల వర్షాలకు జిల్లాలో నష్టపోయిన రైతు లను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వర రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం బాపులపాడు మండలంలోని పలుగ్రామాల్లో రైతు సంఘం నేతలు పర్యటించి నాటు పొగాకు,మొక్కజొన్న, మామిడి,మిర్చి, అపరాలు పంటలను పరిశీలించారు. అనంతరం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడు తూ పొగాకు సాగు చేసిన రైతులు అకాలవర్షానికి తీవ్రంగా నష్టపోయారన్నారు. మొక్కజొన్న, మామిడి ,మిర్చి పంటలకు అపార నష్టం వాటిల్లిందన్నారు. రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. సమావేశంలో కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పంచకర్ల రంగారావు, టీవీ.లక్ష్మణస్వామి, కళ్లం వెంకటేశ్వరరావు, బేత శ్రీనివాసరావు తదిరతులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-25T01:07:20+05:30 IST