ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాబు, జగన్‌ పాలనలను బేరీజు వేస్తున్న ప్రజలు

ABN, First Publish Date - 2023-01-25T00:44:50+05:30

పేదల నోటి దగ్గర కూడు తీసివేసే విధంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ విధానాలు ఉన్నాయని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ధ్వజమెత్తారు.

అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న గద్దె
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాబు, జగన్‌ పాలనలను బేరీజు వేస్తున్న ప్రజలు

తూర్పు ఎమ్మెల్యే గద్దె

రాణిగారితోట, జనవరి 24: పేదల నోటి దగ్గర కూడు తీసివేసే విధంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ విధానాలు ఉన్నాయని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ధ్వజమెత్తారు. మంగళవారం 17వ డివిజన్‌ మసీదు సెంటర్‌ దగ్గర ఇదేం ఖర్మ రాష్ర్టానికి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కేశినేని శివనాథ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో అన్న క్యాంటీన్‌లను ఏర్పాటు చేసి పేదలకు కడుపు నిండా అన్నం పెట్టారని, వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని తొలగించి పేదలను పస్తులు పెడుతున్నారన్నారు. కొత్త తరహా పాలన చూద్దామని ప్రజలు ఓట్లు వేస్తే ప్రజలను ఆయన ఇబ్బందులకు గురిచేస్తున్నారని, చంద్రబాబు పాలనలో జరిగిన మేలు, జగన్‌ హయాంలో చేసిన మేలును ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని అన్నారు. ఇస్త్రం డానియేలు, ముని పోలిపల్లి, రాయి రంగమ్మ, కొక్కెర తిరుపతయ్య, పీరుబాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:44:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising