ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గృహ ప్రవేశాలకు సిద్ధం చేయండి

ABN, First Publish Date - 2023-11-30T01:05:08+05:30

జనవరి 30 నాటికి జిల్లాలో 19489 గృహ నిర్మాణాలను పూర్తిచేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణాలు, ఆడుదాం ఆంధ్రా, తుది ఓటర్ల జాబితా, ప్రాధాన్యత భవన నిర్మాణాలు తదితర అంశాలపై బుధవారం కలెక్టరేట్‌ నుంచి డివిజనల్‌ ఆఫీసర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, స్పెషల్‌ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ దిల్లీరావు, అధికారులు

కృష్ణలంక, నవంబరు 29 : జనవరి 30 నాటికి జిల్లాలో 19489 గృహ నిర్మాణాలను పూర్తిచేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణాలు, ఆడుదాం ఆంధ్రా, తుది ఓటర్ల జాబితా, ప్రాధాన్యత భవన నిర్మాణాలు తదితర అంశాలపై బుధవారం కలెక్టరేట్‌ నుంచి డివిజనల్‌ ఆఫీసర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, స్పెషల్‌ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలందరికీ ఇళ్లలో భాగంగా జగనన్న లే అవుట్లలో గృహ నిర్మాణాలను, త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. జనవరి 30నాటికి జిల్లాలో 19489 గృహ నిర్మాణాలను పూర్తిచేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలన్నారు. మైలవరంలో 3955, తిరువూరులో 481, జగ్గయ్యపేటలో 1169, నందిగామలో 1756, నిర్మాణాలతో పాటు నగరపాలక సంస్థ పరిధిలోని విజయవాడ తూర్పు 2663, విజయవాడ సెంట్రల్‌ 5453, విజయవాడ పశ్చిమ 4012 నియోజకవర్గాలలోని నిర్మాణాల లక్ష్యాలను పూర్తిచేసి సిద్ధం చేయాలన్నారు. లే అవుట్లలో రహదారులు, విద్యుత్‌, నీరు, డ్రెయినేజీ వంటి మౌలిక వసతులను ఇప్పటికే పూర్తి చేయడం జరిగిందన్నారు.

ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు పరిష్కరించండి

ప్రత్యక్ష సంక్షిప్త సవరణ-2024లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు, క్లయిమ్స్‌లకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలన్నారు. దరఖాస్తులను బీఎల్‌వోలు, క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించి నిర్ధారించాలన్నారు. యువ ఓటరు నమోదుకు అవగాహన కల్పించే స్వీప్‌ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. 2024 జనవరి 1 నాటికి ఎన్నికల సంఘానికి ఓటర్ల జాబితా అందించేలా సిద్ధం చేయాలని తెలిపారు.

ఆడుదాం ఆంధ్రా రిజిస్ర్టేషన్‌

వేగవంతం చేయండి..

డిసెంబరు 15 నుంచి ఫిబ్రవరి 3 వరకు నిర్వహించనున్న ‘ఆడుదాం ఆంధ్రా’లో క్రీడాకారుల రిజిస్ర్టేషన్‌ ప్రక్రియను సచివాలయస్థాయిలో వేగవంతం చేయాలన్నారు. ప్రతి క్రీడాకారునికి ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని కలెక్టర్‌ అధికారులను కోరారు.

స్పందన అర్జీలకు పరిష్కారం చూపండి..

ప్రతి సోమవారం నిర్వహించే స్పందనలో నమోదవుతున్న అర్జీలకు నిర్ణీత గడువులోగా సంబంధిత శాఖల అధికారులు పరిష్కారం చూపాలన్నారు. ఏ స్థాయిలోను పెండింగ్‌ అర్జీలు ఉండరాదని కలెక్టర్‌ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ పి.సంపత్‌కుమార్‌, డీఆర్‌వో ఎస్‌.వి.నాగేశ్వరరావు, హౌసింగ్‌ పీడీ రజనీకుమారి, డీఈవో రేణుక, డీఎ్‌సడీవో యు.శ్రీనివాసరావు, చీఫ్‌ కోచ్‌ ఎస్‌.ఎ.అజీజ్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-30T01:05:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising