సంతృప్తికర పరిష్కారాలను అందించండి
ABN, First Publish Date - 2023-07-18T00:28:44+05:30
ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జరుగుతున్న స్పందన కార్యక్రమంలో అందుకున్న విజ్ఞప్తులకు సంతృప్తికర పరిష్కారాలు అందించాలని, సమస్యలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు.
సంతృప్తికర పరిష్కారాలను అందించండి
మేయర్ భాగ్యలక్ష్మి,
నగర కమిషనర్ స్వప్నిల్
పాతరాజరాజేశ్వరి పేట, జూలై 17 : ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జరుగుతున్న స్పందన కార్యక్రమంలో అందుకున్న విజ్ఞప్తులకు సంతృప్తికర పరిష్కారాలు అందించాలని, సమస్యలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంలో నగర ప్రజల నుంచి మేయర్, నగర కమిషనర్ అర్జీలను స్వీకరించారు. మేయర్ మాట్లాడుతూ స్పందనలో నమోదయ్యే అర్జీలను నిర్ధేశించిన గడువులోగా పరిష్కరించాలని అన్నారు. స్పందన కార్యక్రమంలో సోమవారం 21 అర్జీలు వచ్చాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ ఎం. ప్రభాకరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి. రత్నావళి, సిటీ ప్లానర్ జీవీజీఎస్‌వీ ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) డి. వెంకట లక్ష్మి, ఏడీహెచ్ శ్రీనివాసు, ఎస్టేట్ ఆఫీసర్ ఓ.శ్రీనివాస్, బయోలజిస్ట్ డి. సూర్యకుమార్, మేనే జర్ బి. శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-07-18T00:28:44+05:30 IST