ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సిద్ధార్థ వైద్యకళాశాలలో ర్యాగింగ్‌

ABN, First Publish Date - 2023-12-09T01:41:49+05:30

విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌ కలకలం రేపుతోంది. కొద్దిరోజు లుగా సీనియర్‌ విద్యార్థులు చేస్తున్న ర్యాగింగ్‌తో విసుగుపోయిన జూనియర్లు వారి తల్లిదండ్రులకు విషయాన్ని చేరవేశారు.

హాస్టల్‌లో ఉన్న విద్యార్థులు

జూనియర్లతో రికార్డులు రాయిస్తున్న సీనియర్లు..తల్లిదండ్రులకు చెప్పిన విద్యార్థులు

ఎంసీఐకు తల్లిదండ్రుల ఫిర్యాదు

విజయవాడ, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌ కలకలం రేపుతోంది. కొద్దిరోజు లుగా సీనియర్‌ విద్యార్థులు చేస్తున్న ర్యాగింగ్‌తో విసుగుపోయిన జూనియర్లు వారి తల్లిదండ్రులకు విషయాన్ని చేరవేశారు. ఈ ఫిర్యాదు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ)వరకు వెళ్లినట్టు తెలుస్తోంది. నీట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వారి ర్యాంకుల ఆధారంగా మెడికల్‌ కళాశాలల్లో సీట్లు కేటాయిస్తారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చి కళాశాలలో చేరిన విద్యార్థులను హాస్టల్‌లో సీనియర్లు ర్యాగింగ్‌ చేస్తున్నారు. సీనియర్లు కొంతమంది తమ రికార్డులను జూనియర్లకు ఇచ్చి రాయిస్తున్నారు. తమ రికార్డులతోపాటు సీనియర్ల రికార్డులు రాయడంతో జూనియర్లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మర్నాడు కళాశాలలో జరిగే తరగతులకు వెళ్లడం లేదు. నిత్యం ఇదే పనిగా ఉండడంతో భరించలేని కొంతమంది జూనియర్లు తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి హాస్టల్‌లో జరుగుతున్న ర్యాగింగ్‌ గురించి వివరించారు. కొంత మంది తల్లిదండ్రులు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు దీనిపై ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని సిద్ధార్థ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌కు కౌన్సిల్‌ మెయిల్‌ పంపినట్టు సమాచారం. ఈ విషయాన్ని కళాశాల వర్గాలు చాలా గోప్యంగా ఉంచుతున్నాయి. ఎంసీఐ స్పందించి మెయిల్‌ పెట్టడంతో కళాశాల అధికారులు అప్రమత్తమయ్యారు. విషయాన్ని బయ టకు పొకక్కకుండా హాస్టల్‌లో ఉండే జూనియర్లను వారి గదుల్లో నుంచి బయటకు రానివ్వడంలేదు. వారికి ఆహారాన్ని సెక్యూరిటీ సిబ్బంది ద్వారా విద్యార్థుల వద్దకే పంపుతున్నారు.

Updated Date - 2023-12-09T01:41:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising