ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పందన అర్జీలు క్షేత్రస్థాయిలో పరిష్కరించాలి

ABN, First Publish Date - 2023-03-28T00:05:55+05:30

స్పందనలో నగర ప్రజల నుంచి వచ్చే అర్జీలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు.

సమస్యను అడిగి తెలుసుకుంటున్న మేయర్‌ భాగ్యలక్ష్మి, పక్కన కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

స్పందన అర్జీలు క్షేత్రస్థాయిలో పరిష్కరించాలి

మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి

చిట్టినగర్‌, మార్చి 27 : స్పందనలో నగర ప్రజల నుంచి వచ్చే అర్జీలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, నగర్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ అర్జీలను స్వీకరించారు. మేయర్‌ మాట్లాడుతూ స్పందనలో వచ్చే ప్రజా సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. నగర పాలకసంస్థ ద్వారా ప్రజలకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలలో ఎదురవుతున్న ఇబ్బందులను త్వరితగతిన పరిశీలించి వాటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికా రులకు సూచించారు. స్పందనలో 36 అర్జీలు వచ్చాయని మేయర్‌ తెలిపారు. అదనపు కమిషనర్‌ (జనరల్‌)ఎం.శ్యామల, ప్రాజెక్ట్స్‌ కేవీ సత్యవతి, చీఫ్‌ ఇంజనీర్‌ ఎం ప్రభాకరరావు, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పి. రత్నావళి, డిప్యూటీ కమిషనర్‌ (రెవెన్యూ) డి. వెంకటలక్ష్మి, సిటీ ప్లానర్‌ జివిజిఎస్‌వి. ప్రసాద్‌, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ (యూసీడీ) శకుం తల, జాయింట్‌ డైరెక్టర్‌ (అమృత్‌) డాక్టర్‌ కేబీఎన్‌ఎస్‌. లతా, సెక్రటరీ కె. వసంతలక్ష్మి, ఏడీహెచ్‌ శ్రీనివాసు, ఈఈలు నారాయణమూర్తి, ఏఎన్‌ఎన్‌ ప్రసాద్‌, మేనేజర్‌ బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఫ సర్కిల్‌-1 కార్యాలయంలో రెండు అర్జీలు, సర్కిల్‌-2లో మూడు, సర్కిల్‌-3 పరిధిలో మూడు అర్జీలు అందినట్లు జోనల్‌ కమిషనర్లు తెలియజేశారు.

Updated Date - 2023-03-28T00:05:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising