ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా సంక్రాంతి సంబరాలు

ABN, First Publish Date - 2023-01-12T01:27:36+05:30

జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల్లో, పల్లెల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. బందరు మునిసిపల్‌ ప్రధాన పార్కు, రుస్తుంబాద బా లికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ముగ్గుల పోటీని డీఈ వో తాహరాసుల్తానా, డీఎ్‌సవో పార్వతి, డీవైఈవో యువి సుబ్బారావు, మునిసిపల్‌ కమిషనర్‌ చంద్రయ్య సందర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌, జనవరి 11 : జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల్లో, పల్లెల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. బందరు మునిసిపల్‌ ప్రధాన పార్కు, రుస్తుంబాద బా లికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ముగ్గుల పోటీని డీఈ వో తాహరాసుల్తానా, డీఎ్‌సవో పార్వతి, డీవైఈవో యువి సుబ్బారావు, మునిసిపల్‌ కమిషనర్‌ చంద్రయ్య సందర్శించారు. వెలుగు ఫౌండేషన్‌ అధ్యక్షుడు బాబు ఆధ్వర్యంలో విజేతలకు డీఈవో బహుమతులు అందజేశారు. చిన్నారి దివ్య వీణా నాదం ఆకట్టుకుంది. ఎస్వీ పబ్లిక్‌ పాఠశాలలో సంక్రాం తి సంబరాల సందర్భంగా విజేతలకు ప్రిన్సిపాల్‌ విజయ మాధవి, హిందూ కళాశాల అనుబంధ సంస్థల కార్యదర్శి డి.జి.శాస్త్రి బహుమతులు అందజేశారు. నెల్లూరు రవీంద్ర భారతి పాఠశాలలో ముగ్గుల పోటీలు, విచిత్ర వేషధారణ పోటీలు జరిపి విజేతలకు బహుమతులు అందచేశారు. పెడన : పల్లోటి హైస్కూల్‌లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. రంగవల్లులు సృజనాత్మకతకు అద్దం పట్టాయి. హరిదాసు వేషధారణతో అలరించారు. చిన్నారులకు భోగిపండ్లు పోశారు. హైస్కూల్‌ కరస్పాండెంట్‌ ఫాదర్‌ జోజిరెడ్డి, ప్రిన్సిపాల్‌ పి.రాజీవ్‌ తదితరులు పాల్గొన్నారు. బంటుమిల్లి : కొమ్మారెడ్డి పాఠశాలలో డైరెక్టర్‌ కొమ్మారెడ్డి కిషోర్‌ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్‌ కృష్ణవేణి దంపతులు సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువు, భోగిమంటలు, గంగిరెద్దుల విన్యాసం, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. గ్రామ ప్రముఖులు సతీష్‌, మహేష్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గుడివాడ/గుడివాడటౌన్‌: గుడివాడలోని వీకేఆర్‌ వీఎన్‌బీ అండ్‌ ఏజీకే ఇంజినీరింగ్‌ కళాశాలలో వెనిగండ్ల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో ఫౌండేషన్‌ అధినేత వెనిగండ్ల రాము పాల్గొని వాలీబాల్‌ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీన మహిళలకు ముగ్గు ల పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఫౌండేషన్‌ ప్రతినిధులు, వెనిగండ్ల యూత్‌ పాల్గొన్నారు. త్రివేణి పబ్లిక్‌ స్కూల్‌లో వెనిగండ్ల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. వివిధ పోటీల్లో విజేతలకు వెనిగండ్ల రాము బహుమతులను అందజేశారు. పాఠశాల డైరెక్టర్‌ నిమ్మగడ్డ శివశంకర్‌, ఫౌండేషన్‌ ప్రతినిధులు దేవరపల్లి వినయ్‌ప్రకాష్‌, గొర్రెముచ్చు నరసింహారావు, శంకరంపాడు సర్పంచ్‌ కైలే సుబ్బారావు పాల్గొన్నారు. గుడివాడ పురపాలక సంఘం ఆధ్వర్యం లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. వైసీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ రంగారావు, మున్సిపల్‌ ఇంజినీర్‌, మున్సిపల్‌ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గుడివాడ రూరల్‌ : శ్రీరాఘవేంద్ర నగర్‌లోని శ్రీ సాయి షైనింగ్‌ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. బొమ్మల కొలువులు, నృత్యా లు, సంప్రదాయ వేషధారణ, చిన్నారులకు భోగిపండ్లు కనువింతు చేశారు. పాఠశాల యాజమాన్యం లింగమనేని జగదీష్‌, లింగమనేని స్రవంతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Updated Date - 2023-01-12T01:27:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising