ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆధార్‌ అప్‌డేట్‌కు ప్రత్యేక శిబిరాలు

ABN, First Publish Date - 2023-02-05T00:56:06+05:30

కృష్ణాజిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగు లతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవడానికి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ రంజిత్‌ బాషా సూచించారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ రంజిత్‌ బాషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి: కృష్ణా కలెక్టర్‌ రంజిత్‌ బాషా

మచిలీపట్నం టౌన్‌, ఫిబ్రవరి 4: కృష్ణాజిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగు లతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవడానికి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ రంజిత్‌ బాషా సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 6,7 తేదీల్లో జిల్లాలో ఆరు కేంద్రాల్లో ఆధార్‌ అప్‌డేట్‌ శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. ఆధార్‌ కార్డు తీసుకుని పదేళ్లు పూర్తైన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ధ్రువీకరణ పత్రా లతో అప్‌డేట్‌ చేసుకోవాలన్నారు. ఐదేళ్లు దాటిన పిల్లలు బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ చేసుకోవాలన్నారు. కలెక్టరేట్‌, మచిలీపట్నం తపాలా ప్రధాన కార్యాలయం, పెడన, అవనిగడ్డ, గుడివాడ, బంటుమిల్లి తపాలా కార్యాలయాల్లో ఆధార్‌ అప్‌డేట్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మొబైల్‌ డాక్యుమెంటేషన్‌కు రూ.50, బయోమెట్రిక్‌ అప్‌డేట్‌కు రూ.100 శిబిరాల్లో చెల్లించాలని, 5, 10 సంవత్సరాలు దాటిన పిల్లలు ఉచితంగా బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ చేసుకోవచ్చని, గుర్తింపు, చిరునామా, ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని సూచించారు.

Updated Date - 2023-02-05T00:56:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising