ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాణి కుటుంబానికి బాసటగా టీడీపీ

ABN, First Publish Date - 2023-02-15T01:16:49+05:30

తాడేపల్లిలో జగన్మోహన్‌రెడ్డి ఇంటికి కూత వేటుదూరంలో హత్యకు గురైన దళిత యువతి ఎస్తేరు రాణి(దివ్యాంగురాలు) పార్ధివదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం కృష్ణాజిల్లా నందివాడ మండలం జనార్దనపురంలోని తండ్రి ఇంటి వద్దకు మంగళవారం అంత్యక్రియల నిమిత్తం తీసుకువచ్చారు.

దివ్యాంగురాలి కుటుంబసభ్యులకు రూ.2లక్షల చెక్కు అందజేస్తున్న రావి వెంకటేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందివాడ, ఫిబ్రవరి 14 : తాడేపల్లిలో జగన్మోహన్‌రెడ్డి ఇంటికి కూత వేటుదూరంలో హత్యకు గురైన దళిత యువతి ఎస్తేరు రాణి(దివ్యాంగురాలు) పార్ధివదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం కృష్ణాజిల్లా నందివాడ మండలం జనార్దనపురంలోని తండ్రి ఇంటి వద్దకు మంగళవారం అంత్యక్రియల నిమిత్తం తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత, గుడివాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ రావి వెంకటేశ్వరరావు ఎస్తేరు రాణి కుటుంబాన్ని పరామర్శించి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేసి, వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వంలో దళిత మహిళలకు రక్షణ కరువైందన్నారు. సీఎం ఇంటి పక్కనే దళిత మహిళలకు రక్షణ లేకపోతే మారుమూల ప్రాంతాలలో పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సీఎం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై అత్యాచారాలు అధికమయ్యాయన్నారు. దళితుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చి దళితులనే అణగదొక్కుతున్నారన్నారు. టీడీపీ నేత రామకృష్ణ అంధురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-02-15T01:16:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising