వివాదాస్పద ఫ్లెక్సీల తొలగింపులో కార్పొరేషన్ నిర్లక్ష్యం
ABN, First Publish Date - 2023-06-19T00:00:35+05:30
వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన వివాదాస్పద ఫ్లెక్సీలను తొలగించడంలో నగర కార్పొరేషన్ కమిషనర్ వైఖరిని టీడీపీ కార్పొరేటర్ చిత్తజల్లు నాగరాము తదితరులు ఖండించారు.
మచిలీపట్నం టౌన్, జూన్ 18 : వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన వివాదాస్పద ఫ్లెక్సీలను తొలగించడంలో నగర కార్పొరేషన్ కమిషనర్ వైఖరిని టీడీపీ కార్పొరేటర్ చిత్తజల్లు నాగరాము తదితరులు ఖండించారు. లక్ష్మీటాకీసు సెంటర్‌లో వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని టీడీపీ కార్పొరేటర్లు చిత్తజల్లు నాగరాము, దింటకుర్తి సుధాకర్, టీడీపీ నగర అధ్యక్షుడు ఎండి ఇలియాస్ పాషా, కార్యదర్శి పిప్పళ్ళ కాంతారావు, పి.వి. ఫణికుమార్, గోకుల శివ, రమణ, వాకమల్లు శ్రీను, చలమలశెట్టి రమేష్ చించివేశారు. చిత్తజల్లు నాగరాము మాట్లాడుతూ, వివాదాస్పద ఫ్లెక్సీలను తొలగించాలని జిల్లా కలెక్టర్‌కు, నగర పాలక సంస్థ కమిషనర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. కలెక్టర్‌కు ఇచ్చిన వినతిపత్రంపై నగర పాలక సంస్థ కమిషనర్ ఈనెల 8వ తేదీన ఫ్లెక్సీలను తొలగిస్తామని సమాధానం ఇచ్చారని, అయితే ఇంకా తొలగించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. శాంతి భద్రతలను కాపాడేందుకు వివాదాస్పదమైన ఫ్లెక్సీలు తొలగించాలన్నారు.
Updated Date - 2023-06-19T00:00:35+05:30 IST