తెలుగుయువత నాయకుడి కారు అద్దం ధ్వంసం
ABN, First Publish Date - 2023-06-01T01:24:18+05:30
44వ డివిజన్ కల్యాణ వేంకటేశ్వరస్వామి గుడి రోడ్డుపై పార్కు చేసిన తెలుగుయువత పశ్చిమ నియోజక వర్గ ఉపాధ్యక్షుడు కుప్పిలి నాగబాబు హోండా సిటీ కారు వెనుక అద్దాలను కొందరు దుం డగులు బుధవారం తెల్లవారుజామున ధ్వంసం చేశారు
భవానీపురం, మే 31: 44వ డివిజన్ కల్యాణ వేంకటేశ్వరస్వామి గుడి రోడ్డుపై పార్కు చేసిన తెలుగుయువత పశ్చిమ నియోజక వర్గ ఉపాధ్యక్షుడు కుప్పిలి నాగబాబు హోండా సిటీ కారు వెనుక అద్దాలను కొందరు దుం డగులు బుధవారం తెల్లవారుజామున ధ్వంసం చేశారు. కారు వెనుక అద్దంపై ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి అనే పోస్టరును అంటించారు. దాన్ని తొలగించి కారు అద్దాలను ధ్వంసం చేశారని, ఇది వైసీపీ కార్య కర్తల పనేనని నాగబాబు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఇదేం ఖర్మ కార్యక్ర మంలో పాల్గొన్నానని ఆయన తెలిపారు. పశ్చిమ మైనార్టీ నాయకుడు ఎంఎస్.బేగ్ పరిశీలించారు. ధ్వంసం చేసిన వారికి తగిన బుద్ధి చెబుదామని ఆయన ధైర్యం చెప్పారు.
Updated Date - 2023-06-01T01:24:18+05:30 IST