ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తాడేపల్లి ప్యాలె్‌సను వీడి ముఖ్యమంత్రి బయటకు రావాలి

ABN, First Publish Date - 2023-07-29T01:30:07+05:30

విపత్తుల సమయాల్లో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు తాడేపల్లి ప్యాలె్‌సను వీడి ముఖ్యమంత్రి బయటకు రావాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. చల్లపల్లి మండలం పాతమాజేరులో ముంపుబారిన పడిన పంటపొలాలను శుక్రవారం ఉదయం రైతులతో కలిసి ఆయన పరిశీలించారు.

చల్లపల్లిలో దెబ్బతిన్న వరినారును పరిశీలిస్తున్న మండలి బుద్ధప్రసాద్‌

చల్లపల్లి, జూలై 28 : విపత్తుల సమయాల్లో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు తాడేపల్లి ప్యాలె్‌సను వీడి ముఖ్యమంత్రి బయటకు రావాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. చల్లపల్లి మండలం పాతమాజేరులో ముంపుబారిన పడిన పంటపొలాలను శుక్రవారం ఉదయం రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ, ముంపు సమస్యకు ప్రభుత్వ అసమర్ధతే కారణమని మండిపడ్డారు. మాటలు చెప్పటం కాదని, రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని బుద్ధప్రసాద్‌ తెలిపారు. విపత్తులు వచ్చినప్పుడు సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం మానుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. ఇరిగేషన్‌ మంత్రికి ఏనాడైనా సమస్యలు చూపించి నిధులు మంజూరు చేయించారా అని బుద్ధప్రసాద్‌ ఎమ్మెల్యేని ప్రశ్నించారు. గతంలో మంత్రులు సమస్యలు చూసి పరిష్కారానికి కృషిచేసేవారనీ, కానీ మంత్రులు వస్తే ప్రతిపక్షాలను దూషించటం మినహా మరేం చేయట్లేదన్నారు. దయనీయమైన స్థితిలో రైతులు ఉన్నారనీ వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు మండలి వెంకట్రామ్‌, మోర్ల రాంబాబు, నిడమానూరి దిలీ్‌పకుమార్‌, రైతులు పాల్గొన్నారు.

జలాశయాలుగా పంట చేలు

పాతమాజేరులో వరిపొలాలు జలాశయాలను తలపిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న మురుగునీటితో పొలాలు పూర్తిగా నీటిముంపునకు గురయ్యాయి. పాతమాజేరు,పూషడం రోడ్డులో సుమారు 400 ఎకరాల్లో వరిచేలు ముంపులో ఉండగా, వెదపద్ధతిలో సాగుచేసిన వరిపైరు, నాట్లుపూర్తిచేసిన పొలాలు ఎందుకూ పనికిరాని పరిస్థితి ఏర్పడింది. వర్షాలు కురిసి పంటలు ముంపుకు గురైన తర్వాత యంత్రాలతో డ్రెయినేజీలో గుర్రపుడెక్క తొలగింపు చేపడుతున్నారు.

ప్రభుత్వ వైఫల్యమే : రైతులు

ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ముంపు సమస్య ఏర్పడిందని రైతులు మండిపడ్డారు. నాలుగేళ్లుగా మురుగుకాల్వల అభివృద్ధి చేయకపోవటం, గుర్రపుడెక్క తొలగించకపోవటం ముంపునకు కారణమన్నారు. రైతులకు వరి విత్తనాలు ఉచితంగా అందించి చేయూత అందించాలని మాజీ సర్పంచ్‌ యార్లగడ్డ శివరాం, రైతులు పెదబాబు, నాగరాజు తదితరులు కోరారు.

Updated Date - 2023-07-29T01:30:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising