ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇదేనా సామాజిక సాధికారత!

ABN, First Publish Date - 2023-11-06T01:19:42+05:30

దళిత యువకుడితో మూత్రం తాగించి, చిత్రహింసలకు గురిచేసిన సంఘటన రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతుందని విజయవాడ పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం అన్నారు. ఘటనపై నందిగామ ప్రజాప్రతినిధులు స్పందించిన తీరు దారుణమని విమర్శించారు.

జగ్గయ్యపేట, నవంబరు 5 : దళిత యువకుడితో మూత్రం తాగించి, చిత్రహింసలకు గురిచేసిన సంఘటన రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతుందని విజయవాడ పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం అన్నారు. ఘటనపై నందిగామ ప్రజాప్రతినిధులు స్పందించిన తీరు దారుణమని విమర్శించారు. ఆదివారం విలేకర్లతో నెట్టెం మాట్లాడుతూ.. దళితులు, గిరిజనులు, మహిళలపై దాడులు, అత్యాచారాల్లో రాష్ట్రం నెంబర్‌ 1 స్థానంలో ఉందని జాతీయ క్రైమ్‌ బ్యూరో రికార్డులు చెప్పటం సిగ్గు చేటన్నారు. దేశంలో జరుగుతున్న సంఘటనల్లో 70శాతం మన రాష్ట్రంలోనే జరగటం, వాటికి ముఖ్యమంత్రి సామాజిక వర్గం వారే బాధ్యులు కావటం అత్యంత దురదృష్టకరమన్నారు. నందిగామలో శ్యాం, ఒంగోలులో నవీన్‌ల ఘటనలు చూసైనా అధికార పార్టీలోని దళిత, గిరిజన ఎమ్మెల్యేలు పునరాలోచన చేసుకోవాలని, పార్టీని వీడి ఆత్మగౌరవం కాపాడుకోవాలని కోరారు.

దళితులపై దాడులు అమానుషం.. : సౌమ్య

నందిగామ : వైసీపీ గూండాలు దళితులపై అమానుష దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆరోపించారు. కాండ్ర శ్యామ్‌కుమార్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ అనాసాగరంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద టీడీపీ నేతలు ఆదివారం నిరసన తెలిపారు. సౌమ్య మాట్లాడుతూ, దళితులకు రక్షణ కల్పిస్తూ అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రచిస్తే ఆ రాజ్యాంగాన్నే అవమానిస్తూ వైసీపీ గూండాలు దళితులపై దాడులకు తెగబడుతున్నారన్నారు. దాడులను ముఖ్యమంత్రి జగన్‌ సమర్థిస్తున్నాడని ఆరోపించారు. కార్యక్రమంలో ఏచూరి రామకృష్ణ, శాఖమూరి స్వర్లలత, వంశీధర్‌, కాసర్ల లక్ష్మీనారాయణ, కత్తురోజు శ్రీనివాసాచారి, ఇంటిమాల ప్రవీణ, ఆనంద్‌, చలమల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కొండపల్లిలో దేవినేని ఉమా నిరసన..

ఇబ్రహీంపట్నం : కంచికచర్లలో దళిత యువకుడు కాండ్రు శ్యాంకుమార్‌పై దాడికి నిరసనగా కొండపల్లి బి.కాలనీ వద్ద ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొందరు అధికారులను అడ్డంపెట్టుకుని ముఖ్యమంత్రి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అన్ని ప్రధాన దినపత్రిల్లో ఓట్ల అవకతవకలపై వార్తలు వస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్సీ సెల్‌ నాయకులు కొత్తపల్లి ప్రకాశ్‌, చుట్టుకుదురు శ్రీనివాసరావు, చెన్నుబోయిన చిట్టిబాబు, కరిమికొండ శ్రీలక్ష్మి, పులి అరుణకుమారి, కూచిపూడి దీలిప్‌ కుమార్‌, మిక్కిలి విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-06T01:19:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising