ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీకా పిల్లల జీవితానికి రక్ష

ABN, First Publish Date - 2023-04-09T00:29:40+05:30

వ్యాఽధినిరోధక టీకాలతో పిల్లల జీవితానికి రక్షణ ఏర్పడుతుందని, వారికి సోకే ప్రాణాంతక వ్యాధులను అరికట్టి, రోగనిరోఽధకశక్తిని పెంపొందించడంలో వ్యాధినిరోధక టీకాలు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వి. రామిరెడ్డి సూచించారు.

బాపులపాడు పీహెచ్‌సీ సిబ్బందికి సూచినలిస్తున్న ఆర్‌బీఎస్‌కే అధికారి రత్నగిరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఉంగుటూరు, ఏప్రిల్‌ 8 : వ్యాఽధినిరోధక టీకాలతో పిల్లల జీవితానికి రక్షణ ఏర్పడుతుందని, వారికి సోకే ప్రాణాంతక వ్యాధులను అరికట్టి, రోగనిరోఽధకశక్తిని పెంపొందించడంలో వ్యాధినిరోధక టీకాలు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వి. రామిరెడ్డి సూచించారు. మండలంలోని పెదఅవుటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. వ్యాధినిరోధక టీకాల కార్యక్రమాలు క్షేత్రస్ధాయి పరిశీలనలో భాగంగా తొలుత గన్నవరం మండల పరిధిలోని గన్నవరం-1, కేసరపల్లి, జక్కులనెక్కలం గ్రామాలను సందర్శించి, అక్కడ అంగన్‌వాడీ కేంద్రాల్లో జరుగుతున్న వ్యాధినిరోధక టీకాల కార్యక్రమాలను పరిశీలించిన అనంతరం పెదఅవుటపల్లి పీహెచ్‌సీని సందర్శించిన ఆయన ల్యాబ్‌, మందుల వార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో అవసరమైన అన్నిరకాల మందులు అందుబాటులో వుంచుకోవాలన్నారు. టీకా కార్డులో సూచించిన విధంగా ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ జిల్లా ప్రోగ్రామ్‌ అండ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సి.సుదర్శన్‌బాబు, పీహెచ్‌సీ వైద్యాధికారులు డాక్టర్‌ వి.హిమబిందు, డాక్టర్‌ షేక్‌ కరీముల్లా, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

మాతా శిశు మరణాలు తగ్గించాలి

హనుమాన్‌జంక్షన్‌ : మాతా శిశువులకు నూరుశాతం వ్యాక్సినేషన్‌ వేయించి మరణాలను తగ్గించడానికి వైద్య సిబ్బంది సేవలను అందించాలని రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే)కృష్ణాజిల్లా ప్రోగ్రాం అధికారి కె.రత్నగిరి తెలిపారు. శనివారం ఆయన బాపులపాడు పీహెచ్‌సీకి సంబంధించిన వ్యాక్సినేషన్‌ కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. పుట్టిన ప్రతి బిడ్డకు 100శాతం వ్యాక్సినేషన్‌ జరిగేలా చూడాలన్నారు. ఎవరైనా డ్రాప్‌ అవుట్స్‌ పిల్లలు ఉంటే ప్రత్యేక వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. గర్భిణులు, బాలింత లకు హెచ్‌బీ శాతం తక్కువగా ఉండి రక్తహీనతతో బాధపడే వారిని గుర్తించి వారికి అంగన్వాడీకేంద్రాలు ద్వారా అనుబంధ ఆహారాన్ని అందించాలన్నారు. ఐరన్‌, పోలిక్‌ యాసిడ్‌, కాల్షియం మాత్రలు ఇంటింటికి తిరిగి అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. కార్యక్ర మంలో పీహెచ్‌సీ వైద్యాధికారి మంజుషా, సీహెచ్‌వో ఫణి కుమార్‌,సిబ్బంది అప్పారావు, అలీమాబి, నాగరాజు, జమీమా, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-09T00:29:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising