ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్నుల పండువగా తిరుపతమ్మ కల్యాణం

ABN, First Publish Date - 2023-02-06T00:52:22+05:30

తిరుపతమ్మ - గోపయ్య స్వామి కల్యాణ మహోత్సవం మాఘ శుద్ధ పౌర్ణమి ఆదివారం రాత్రి కన్నుల పండువగా నిర్వహించారు. గ్రామానికి చెందిన గోపయ్యస్వామి వంశీకుల తరఫున కాకాని రంజిత్‌ కుమార్‌- నిషిత దంపతులు, తిరుపతమ్మ వం శీకుల తరఫున కొల్లా రాజశేఖర్‌-అపర్ణ దంపతులు మేళతాళాలతో ఊరేగింపుగా వచ్చి పట్టు వస్త్రాలు, పసుపుకొమ్ములు సమర్పించి కల్యాణం పీటలపై కూర్చున్నారు.

కల్యాణాన్ని జరిపిస్తున్నఅర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుగంచిప్రోలు, ఫిబ్రవరి 5: తిరుపతమ్మ - గోపయ్య స్వామి కల్యాణ మహోత్సవం మాఘ శుద్ధ పౌర్ణమి ఆదివారం రాత్రి కన్నుల పండువగా నిర్వహించారు. గ్రామానికి చెందిన గోపయ్యస్వామి వంశీకుల తరఫున కాకాని రంజిత్‌ కుమార్‌- నిషిత దంపతులు, తిరుపతమ్మ వం శీకుల తరఫున కొల్లా రాజశేఖర్‌-అపర్ణ దంపతులు మేళతాళాలతో ఊరేగింపుగా వచ్చి పట్టు వస్త్రాలు, పసుపుకొమ్ములు సమర్పించి కల్యాణం పీటలపై కూర్చున్నారు. తిరుపతమ్మ - గోపయ్య స్వాముల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి మేళతాళాలు మంగళవాయిద్యాలతో వేదికపైకి తీసుకువచ్చి కల్యాణాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయ భాను-విమలాభాను దంపతులు పట్టువస్త్రాలను అమ్మవారికి సమర్పించి పీటలపై కూర్చున్నారు. కల్యాణం పీటలపై కూర్చున్న వారిలో చైర్మన్‌ ఇంజం చెన్నకేశవరావు దంపతులు, ఈవో జీవీడీఎల్‌ లీలాకుమార్‌ దంపతులు, నందిగామ ఆర్డీవో ఎ.రవీంద్రరావు దంపతులు, తహసీల్దార్‌ కె.లక్ష్మీ కల్యాణి దంపతులు, నందిగామ ఏసీపీ జి.నాగేశ్వరరెడ్డి దంపతులు, ఏపీ బీవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి దంపతులు ఉన్నారు. తిరుపతమ్మ పెద్ద తిరునాళ్ల మహోత్సవాలను ఆదివారం ఈవో జీవీడీఎల్‌ లీలాకుమార్‌, చైర్మన్‌ ఇంజం చెన్నకేశవరావు ప్రత్యేక పూజలు చేసి అఖండ దీపాన్ని వెలిగించి ప్రారంభించారు. 41 రోజుల పాటు దీక్షలుచేసిన స్వాములకు స్థానిక శివాలయంలో ఆలయ ప్రధాన అర్చకుడు మర్రిబోయిన వెంకటరమణ ఆధ్వర్యంలో ఇరుముడులు కట్టారు. స్వాములు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి ఇరుముడులు సమర్పించారు.

Updated Date - 2023-02-06T00:52:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising