ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం

ABN, First Publish Date - 2023-07-08T01:19:19+05:30

వైసీపీ ప్రభుత్వ పాల నలో నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని టీడీపీ తాడిగడప మునిసిపాలిటీ కార్యదర్శి మొక్కపాటి శ్రీనివాస్‌, బీసీ సెల్‌ అధ్యక్షుడు శొంఠి శివరాం ప్రసాద్‌ విమర్శించారు.

యనమలకుదురులో జరిగిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో మొక్కపాటి, శొంఠి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనమలూరు, జూలై 7 : వైసీపీ ప్రభుత్వ పాల నలో నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని టీడీపీ తాడిగడప మునిసిపాలిటీ కార్యదర్శి మొక్కపాటి శ్రీనివాస్‌, బీసీ సెల్‌ అధ్యక్షుడు శొంఠి శివరాం ప్రసాద్‌ విమర్శించారు. శుక్రవారం యనమలకుదురు 17వ డివిజన్‌ కాల్వకట్ట రోడ్డు, 22వ డివిజన్‌లో జరిగిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో వారు స్థానిక నాయకులతో కలిసి ప్రజలతో మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలో టీడీపీ హయాంలో వేసిన రోడ్లు తప్ప కనీసం ఒక్క రోడ్డును వేయలేదని, కనీసం ధ్వంస మైన రోడ్లను మరమ్మతులు చేయలేదన్నారు. యనమలకుదురు బ్రిడ్జి నిర్మాణంలో కేవలం పదిశాతం పనిని నాలుగేళ్లలో పూర్తి చేయలేదని స్థానికులు మం డిపడ్డారు. వర్షాకాలం ప్రారంభమవటంతో అంతర్గత రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సైకో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఒక చేత్తో బటన్‌ నొక్కుతూ మరో చేత్తో దానికి పది రెట్లకు పైగా సొమ్మును నాసిరకం మద్యం, చెత్తపన్నుల రూపంలో లాగేసుకుంటున్నాడని విమర్శించారు. బడుగు బలహీన వర్గాల జీవితాలు వైసీపీ ప్రభుత్వంలో మరింత దిగజారాయన్నారు. ప్రజల భవిష్యత్తుకు భరోసా లేకుండా పోయిందని, రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా ఒక్క చంద్రబాబు మాత్రమేనని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బోడె ప్రసాద్‌ను, ముఖ్యమంత్రిగా చంద్రబాబును ఎన్నుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగం సుబ్రహ్మ ణ్యం, సంపర శేఖర్‌, బత్తిన దుర్గారావు, పండుల రజిని, బలగం కొండ, షకీలా, మౌనిక, అశోక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-07-08T01:19:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising