కుందూలో15 కేజీల చేప లభ్యం
ABN, First Publish Date - 2023-08-11T00:34:08+05:30
మండలంలోని ఉయ్యాలవాడ కుందూ నదిలో 15 కేజీ చేప లభ్యమైంది.

మత్స్యకారుడికి దొరికిన చేప
ఉయ్యాలవాడ, ఆగస్టు 10: మండలంలోని ఉయ్యాలవాడ కుందూ నదిలో 15 కేజీ చేప లభ్యమైంది. కుందూలో నీటి ప్రవాహం నిలిచి పోవడంతో గురువారం మత్స్యకారులు వేటకు వెళ్లారు. ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన నారాయణ అనే మత్స్సకారుడి వలకు పెద్ద చేప లభించింది. ఈ చేపను తూకం వేయగా 15 కేజీల బరువు ఉన్నట్లు వారు తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద చేప పడలేదని మత్స్యకారులు తెలిపారు.
Updated Date - 2023-08-11T00:34:08+05:30 IST