ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సివిల్‌ సప్లయిస్‌లో భారీ కుంభకోణం

ABN, First Publish Date - 2023-04-02T23:24:26+05:30

నంద్యాల పౌరసరఫరాల విభాగంలో 2018లో చోటుచేసుకున్న ఓ అవినీతి భాగోతం వెలుగులోకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఆలస్యంగా వెలుగు చూసిన వైనం

అప్పటి డీటీపై కేసు నమోదు

నంద్యాల (నూనెపల్లె), ఏప్రిల్‌ 2: నంద్యాల పౌరసరఫరాల విభాగంలో 2018లో చోటుచేసుకున్న ఓ అవినీతి భాగోతం వెలుగులోకి వచ్చింది. అప్పట్లో జరిగిన కుంభకోణంపై ప్రస్తుత కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీంతో అవినీతికి పాల్పడిన అప్పటి డిప్యూటీ తహసీల్దార్‌ రామాంజనేయులుపై నంద్యాల టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. టూ టౌన్‌ సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నంద్యాలలో 2018లో సివిల్‌ సప్లయిస్‌ డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేసిన రామాంజనేయులు గోడౌన్‌లోని బియ్యం, గోధుమలు, పామాయిల్‌, చక్కెర తదితర నిత్యావసర వస్తువులను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నారు. ప్రజలకు పంపిణీ చేయాల్సిన నిత్యావసర వస్తువులను పక్కదారి మళ్లించి రూ.64.50 లక్షలు వెనకేసుకున్నట్లు నివేదికలో తేలింది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రస్తుత సివిల్‌ సప్లయిస్‌ గోడౌన్‌ మేనేజర్‌ రాజు ఫిర్యాదుతో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు టూ టౌన్‌ సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. రామాజనేయులు ఉద్యోగ విరమణ అనంతరం కర్నూలులో నివాసం ఉంటున్నట్లు తెలిసింది.

Updated Date - 2023-04-02T23:24:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising