కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

యాగంటి క్షేత్రంలో ముగిసిన చండీయాగం

ABN, First Publish Date - 2023-08-07T23:42:03+05:30

మండలంలోని ప్రముఖ శైవక్షేత్రమైన యాగంటి క్షేత్ర సమీపంలో వెలిసిన పార్వతీదేవి మారుమిళ్ల చెలిమ క్షేత్రంలో లోక కల్యాణార్థం గత 20 రోజులుగా నిర్వహిస్తున్న చండీ యాగం పూర్ణాహుతితో సోమవారం ముగిసింది.

యాగంటి క్షేత్రంలో ముగిసిన చండీయాగం
చండీయాగంలో పాల్గొన్న పీఠాధిపతి శంబు సోమనాథ శివాచార్యులు

బనగానపల్లె, ఆగస్టు 7: మండలంలోని ప్రముఖ శైవక్షేత్రమైన యాగంటి క్షేత్ర సమీపంలో వెలిసిన పార్వతీదేవి మారుమిళ్ల చెలిమ క్షేత్రంలో లోక కల్యాణార్థం గత 20 రోజులుగా నిర్వహిస్తున్న చండీ యాగం పూర్ణాహుతితో సోమవారం ముగిసింది. గత 20 రోజులుగా అధిక సంఖ్యలో భక్తులు ఈ యాగంలో పాల్గొన్నారు. కర్ణాటకకు చెందిన పంచాక్షరి మహాసంస్థాన పీఠాధిపతి శంబు సోమనాథ శివాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. నిర్వాహకులు రామక్రిష్ణారెడ్డి, రాంమోహన్‌ రెడ్డి, రమణ రెడ్డి, పాతపాడు సర్పంచ్‌ మహేశ్వర్‌ రెడ్డి, మల్లేశ్వర్‌ రెడ్డి, మల్లికార్జున్‌ రెడ్డి, యాగంటి ఆలయ మాజీ చైర్మన్‌ బత్తుల బాలిరెడ్డి, పాతపాడు, మీరాపురం, యాగంటిపల్లె గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2023-08-07T23:42:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising