ఫేస్ యాప్ రద్దు చేయాలి
ABN, First Publish Date - 2023-03-20T23:01:02+05:30
రాష్ట్ర వ్యాప్తంగా అంగనవాడీలకు ఫేస్ యాప్‌ను రద్దుచేయాలని, కనీస వేతనాలు పెంచాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు.
కర్నూలు(హాస్పిటల్), మార్చి 20: రాష్ట్ర వ్యాప్తంగా అంగనవాడీలకు ఫేస్ యాప్‌ను రద్దుచేయాలని, కనీస వేతనాలు పెంచాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం ఏపీ అంగనవాడీ వర్కర్ అండ్ హెల్పర్స్ యూనియన సీఐటీయూ ఆధ్వర్యంలో కర్నూలు రూరల్, అర్బన టీచర్లు కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు పి. నిర్మలమ్మ, జిల్లా నాయకులు ఎం. గోపాల్ మాట్లాడుతూ జగన ప్రభుత్వం ఎన్నికల ముందు అంగనవాడీలకు తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా రూ.1000 జీతం పెంచి ఇస్తామని చెప్పి మాట తప్పిందని ఆరోపించారు. అంగనవాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు.
Updated Date - 2023-03-20T23:01:02+05:30 IST