ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బడుగుల ఆశాజ్యోతి పూలే

ABN, First Publish Date - 2023-11-28T23:44:22+05:30

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే అని, ఆయన చూపిన మార్గంలో బీసీలంతా సమష్టిగా రాజ్యాధికారం కోసం పని చేయాలని టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీటీ నాయుడు పిలుపునిచ్చారు.

రాజ్యాధికారమే లక్ష్యంగా పని చేయాలి

టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు పిలుపు

కర్నూలు(అగ్రికల్చర్‌), నవంబరు 28: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే అని, ఆయన చూపిన మార్గంలో బీసీలంతా సమష్టిగా రాజ్యాధికారం కోసం పని చేయాలని టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీటీ నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం కర్నూలు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే 133వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సాధికార కమిటీ కన్వీనర్‌ వై.నాగేశ్వరరావు, కోడుమూరు ఇన్‌చార్జి ఆకేపోగు ప్రభాకర్‌, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు పాల్గొన్నారు. పార్టీ నాయకులు ముందుగా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీటీ నాయుడు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల వెనుకుబాటుతనాన్ని రూపుమాపడానికి పూలే విద్య ఒక్కటే మార్గమని గుర్తించారని అన్నారు. టీడీపీ ఆవిర్భవించిన తొలి రోజుల్లోనే బీసీ సామాజిక ప్రజలను రాజకీయంగా, ఉద్యోగపరంగా మంచి స్థానాలు కల్పించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు సంజీవలక్ష్మి, పరమేష్‌, మహేష్‌గౌడు, నాగరాజు యాదవ్‌, రాజు యాదవ్‌, విజయకుమార్‌, షేక్షావలి, శివశంకర్‌ నాయుడు, ఆనంద్‌, నరసింహులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-28T23:44:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising