జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్త: కలెక్టర్‌

ABN, First Publish Date - 2023-04-12T00:34:39+05:30

సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కలెక్టర్‌ సృజన ప్రజలకు పిలుపునిచ్చారు.

జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్త: కలెక్టర్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ సృజన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కర్నూలు(ఎడ్యుకేషన్‌), ఏప్రిల్‌ 11: సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కలెక్టర్‌ సృజన ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మాజ్యోతి రావు పూలే 197వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం బిర్లా గేటు సర్కిల్‌లో పూలే విగ్రహానికి కలెక్టర్‌ పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సృజన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే బాల్య వివాహాల నిర్మూలనకు, విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కర్నూలు ఎంపీ డా.సంజీవకుమార్‌ మాట్లాడుతూ పార్లమెంటులో ఆరు ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోరామన్నారు. అనంతరం పాణ్యం, కర్నూలు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, హఫీజ్‌ఖాన్‌, మేయర్‌ బీవై రామయ్య మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బుట్టా రేణుక, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా.వి.పార్థసారథి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సుభాస్‌ చంద్రబోస్‌, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

కల్లూరు: మహాత్మా జ్యోతిరావుపూలే ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పాణ్యం టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గౌరుచరిత, నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పిలుపుని చ్చారు. మంగళవారం పూలే జయంతిని పురస్కరించుకుని తన స్వగృహం, శరీన్‌నగర్‌లోని పూలే విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పెరుగు పురుషోత్తంరెడ్డి, బి.నాగిరెడ్డి, ప్రభాకర్‌ యాదవ్‌, కె.మహేష్‌గౌడు, కేతూ రు మధు, శేఖర్‌చౌదరి, ఎస్‌.ఫిరోజ్‌, వాకిటి మాదేష్‌, ధనుంజయ పాల్గొన్నారు.

కర్నూలు(కల్చరల్‌): కుల వివక్షతపై పోరాడిన యోధుడు మహాత్మా జ్యోతిబా పూలే అని వీహెచ్‌పీ నగర అధ్యక్షుడు టీసీ మద్దిలేటి కొనియాడారు. బిర్లాగేటు వద్ద పూలే విగ్రహానికి వీహెచ్‌పీ నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ నగర ఉపాధ్యక్షుడు కృష్ణప రమా త్మ, నగర కార్యదర్శి ఈపూరి నాగరాజు, సత్సంగ్‌ కన్వీనర్‌ శేఖర్‌, నాయకులు సల్కాపురం బాబు, సాయి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు(రూరల్‌): కర్నూలు కొత్తబస్టాండ్‌లో మంగళవారం ఆర్టీసీ అధికారుల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈకార్యక్రమానికి కర్నూలు ప్రజారవాణా అధికారి టి.వెంక టరామం ముఖ్యఅథితిగా హాజరై పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ రమణ, మేనేజర్లు సుధారాణి, సర్దార్‌హుస్సేన్‌, డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు.

కోడుమూరు: పట్టణంలోని పాతబస్టాండ్‌లో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను సర్పంచు భాగ్యరత్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకలను పంచాయతీ కార్యదర్శి అజయ్‌భాస్కర్‌ హాజరయ్యారు. కార్యక్రమంలో ఎమ్మా ర్పీఎస్‌ నాయకులు ఆంధ్రయ్య, సీపీఎం నాయకులు గఫూర్‌మియా, వీరన్న వార్డు మెంబర్‌ ప్రతాప్‌రెడ్డి, రవీంద్ర, బిల్‌ కలెక్టర్‌ మహేశ్వరరెడ్డి, లాయర్‌ సోమశంకర్‌ యాదవ్‌, జయన్న, ఆచారి, రాముడు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-12T00:34:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising