ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరమేశా.. గంగ ఏదీ?

ABN, First Publish Date - 2023-04-24T00:07:34+05:30

ప్రకృతి అందాల కాల్వబుగ్గ పుణ్యక్షేత్రంలో గంగ కరువైంది.

నీరు లేని పెద్ద కోనేరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒట్టిపోయిన కాల్వబుగ్గ కోనేర్లు

స్వామివారి అభిషేకాలకు నీరు కరువే

పట్టించుకోని దేవదాయ శాఖ అధికారులు

ఓర్వకల్లు, ఏప్రిల్‌ 23: ప్రకృతి అందాల కాల్వబుగ్గ పుణ్యక్షేత్రంలో గంగ కరువైంది. వందల యేళ్లుగా ప్రశాంతత, అధ్యాత్మికత నెలకొన్న క్షేత్రం ఇది. భూగర్భజలాలు ఉబికివచ్చే ప్రాంతంలో కోనేర్లను నిర్మించారు. దాదాపు 200 ఏళ్లుగా నీటి ఎద్దడి లేకుండా విరాజిల్లింది. గత ఏడేళ్లుగా విపరీత ధోరణుల వల్ల క్షేత్రం తన సహజ అందాలను ఏటేటా కోల్పోతూ వస్తోంది. ఏకంగా కోనేర్లు ఎండి పోతున్నాయి. కాల్వబుగ్గ రామేశ్వరస్వామి క్షేత్రంలో ఎన్నడూ లేనివిధంగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. చిన్న కోనేరు, పెద్దకోనేరు వాగు వెంట నీటితో కళకళలాడిన కాల్వబుగ్గ క్షేత్రం నేడు నీరు లేక వెలవెలబోతోంది. కోనేర్లు ఎండిపోవడంతో ఆల యంలో అభిషేకానికి కూడా పక్కన ఉన్న కొళాయిల వద్దకు వెళ్లి నీరు తెచ్చు కోవాల్సిన పరిస్థితి నెలకొంది. కోనేర్ల్లలో నీరు లేకపోవడంతో స్నానాలు ఆచరిం చేందుకు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తులు రాక కూడా తగ్గింది. చిన్న కోనేటి సమీపంలో రెండు బోర్లు వేసినా అవి కూడా భూగర్భజ లాలు ఎండిపోవడంతో రెండు కోనేర్లతో పాటు వాగులో చుక్క నీరు లేక ఎడారిగా మారాయి. ఒకప్పుడు కాల్వబుగ్గ పుష్కలమైన నీటి వనరులు భక్తులను ఆహ్లాదప రచడమే కాకుండా హుశేనాపురం, కాల్వ గ్రామాలకు చెందిన 300 ఎకరాలకు నీటి ప్రధాన సౌకర్యం అందించేంది.. అయితే.. ఏడు గ్రామాలకు తాగునీరు కూడా అందించేది. ప్రస్తుతం నీరు లేకపోవడంతో ఆ పొలాలు బీడుగా మారాయి. ఈ క్షేత్రంలో ప్రతి యేటా కొన్ని వందల వివాహాలు జరుగుతాయి. అనేక శుభకార్యా లకు వేదిక, వేల సంఖ్యలో భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా క్షేత్రం ప్రశస్తిని కోల్పోయే ప్రమాదాన్ని నెలకొంటుంది. భక్తులకు నీటి కష్టాలను తీర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల దిశగా ఎలాంటి చర్యలు చేపట్ట లేదు. సహజసిద్ధంగా ఏడాది పొడవునా నీటితో కళకళలాడే బుగ్గలు ఎండి పోతున్నా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భూగర్భజలాలను పరీక్షించే దిశగా ఎలాంటి ముందస్తు చర్యలు కూడా తీసుకోలేదు. గత ఏడేళ్లుగా వర్షం వస్తేనే కోనేర్లల్లో నీరు.. ఎండాకాలమంతా ఒట్టిపోయిన కోనేర్లు దర్శనమిస్తున్నాయి. వీటి పైన దేవదాయశాఖ అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇంకిపోయిన నీటి బుడగలు

కాల్వబుగ్గ క్షేత్రంలో నీటి బుడగలు ఎండిపోయాయి. గతంలో నీటితో కళకళలాడే కోనేర్లు నీరు లేక వెలవెల బో తున్నాయి. నీటి బుడగలు 300 ఎకరాలకు నీరు అందించేది. ప్రస్తుతం ఏడేళ్ల నుంచి నీరు కరువైంది. వర్షాలు లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది.

- నాగరాజు, భక్తుడు

పూర్వపు జ్ఞాపకాలు కరువే

గత ఏడేళ్లుగా పూర్వ జ్ఞాపకాలు కరువవయ్యాయి. గతంలో హుశేనాపురం నుంచి కాలినడకన వెళ్లి కోనేర్ల్లలో స్నా నాలచరించేవారం. రానురాను కాల్వ బుగ్గలో నీరు కరువయ్యాయి. వీటితో పాటు భక్తులు కూడా ఇబ్బందులు పడు తున్నాం. తాగునీరే కాకుండా సాగునీరు కూడా అందించేది. కాల్వబుగ్గపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి.

- సుధాకర్‌, భక్తుడు

ప్రత్యేక చర్యలు చేపట్టండి

కాల్వబుగ్గలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. గతంలో నీటితో కళకళలాడే కోనేర్లు ఒట్టిపోయాయి. అధికారులు మాత్రం ఈ విషయంపై స్పందిం చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాతీయ రహదారి పక్కనే ఆలయం ఉండటంతో ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉంది. అధికారులు స్పం దించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.

- గోప సుబ్బారెడ్డి, భక్తుడు

Updated Date - 2023-04-24T00:07:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising