ఆర్జేడీని సస్పెండ్ చేయాలి’
ABN, First Publish Date - 2023-02-18T00:08:46+05:30
పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ ప్రతాపరెడ్డి అధికార పార్టీ ఏజంట్‌గా వ్యవహరిస్తున్నారని, తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
నంద్యాల టౌన్, ఫిబ్రవరి 17: పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ ప్రతాపరెడ్డి అధికార పార్టీ ఏజంట్‌గా వ్యవహరిస్తున్నారని, తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. శుక్రవారం సీపీఐ కార్యాలయం నుంచి సాయిబాబానగర్ ఆర్చీ వరకు పట్టణ కార్యదర్శి డి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. నాయకులు బాబాఫకృద్దీన్, ప్రసాద్, శ్రీనివాసులు మాట్లాడారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థికి అనుకూలంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రచారం చేస్తూ, ఒత్తిడి తీసుకువస్తున్న ప్రతాపరెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని అన్నారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నందికొట్కూరు: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆర్జేడీ ప్రతాపరెడ్డిని సస్పెండ్ చేయాలని సీపీఐ నాయకులు రఘురామూర్తి డిమాండ్ చేశారు. నందికొట్కూరు పట్టణంలోని పటేల్ సెంటర్‌లో సీపీఐ, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు నిరసన తెలిపారు. సీపీఐ నాయకులు రఘురామూర్తి, రమేష్ బాబు, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు లు, జిల్లా సహాయక కార్యదర్శి మహానంది, తాలుకా అధ్యక్షులు వీరేంద్ర, వినోద్, ఏఐటీయూసీ నాయకులు శంకర్, శ్రీనివాస్, బాషా పాల్గొన్నారు.
Updated Date - 2023-02-18T00:08:47+05:30 IST