సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం
ABN, First Publish Date - 2023-07-03T23:45:21+05:30
రుద్రవరంలో వాసవీ కన్యకా పరమేశ్వరి కల్యాణ మండపంలో సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించారు.
రుద్రవరం, జూలై 3: రుద్రవరంలో వాసవీ కన్యకా పరమేశ్వరి కల్యాణ మండపంలో సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి మాట్లాడుతూ సమాజంలో సత్యనిష్ట నెలకొనాలని సత్యనారాయణస్వామి సామూహిక వ్రతం చేపట్టినట్లు తెలిపారు. వేద మంత్రోచ్ఛణల మధ్య సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం ఆమంచి వెంకటేశ్వరశర్మ, రాచమడుగు విశ్వనాధశర్మ, హరిశర్మ, మహేశ్వరశర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి సామూహిక వ్రతంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఇస్కాన్ భక్తిఉద్యమ ప్రచారకులు నిత్య తృప్తదాస్, ఆర్యవైశ్య సంఘం కోశాధికారి నరసింహులు, వెంకటేశ్వర్లు, నల్లగట్ల సుబ్బనరసయ్య త దితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-07-03T23:45:21+05:30 IST