ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయాలకు శివరాత్రి శోభ

ABN, First Publish Date - 2023-02-18T00:27:31+05:30

మహా శివరాత్రి పర్వదిన వేడుకలకు నగరంలోని శైవ దేవాలయాలు ముస్తాబయ్యాయి.

విద్యుద్దీపాల అలంకరణలో బుగ్గ రామేశ్వరుని ఆలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూపాల సంగమేశ్వర క్షేత్రానికి ఆర్టీసీ బస్సులు

కర్నూలు(కల్చరల్‌), ఫిబ్రవరి 17: మహా శివరాత్రి పర్వదిన వేడుకలకు నగరంలోని శైవ దేవాలయాలు ముస్తాబయ్యాయి. శనివారం వేకువ జాము నుంచే విశేష పూజలు, అభిషేకార్చనలు చేపట్టనున్నారు. జగన్నాథ గట్టుపై వెలసిన రూపాల సంగమేశ్వర స్వామి క్షేత్రానికి వెళ్లేందుకు భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.

జగన్నాథ గట్టుపై.. నగర శివారులోని జగన్నాథగట్టుపై వెలసిన ఉమా సమేత రూపాల సంగమేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం, ఆదివారం మహాశివరాత్రి వేడుకలు నిర్వహిస్తారు. ఈసందర్భంగా జగన్నాథగట్టు అభివృద్ధి సమితి, దేవదాయ శాఖ, దిన్నెదేవరపాడు గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టి లో పెట్టుకొని క్యూలైన్లు, బారికేడ్లు నిర్మించినట్లు అభివృద్ధి సమితి ప్రతినిధులు పి. నరసింహారెడ్డి, ఇ.మల్లికార్జున రెడ్డి, ఆలయ ఈవో వై. గుర్రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు, ఉదయం 9 గంటల నుంచి భక్తులు స్వయంగా క్షీరాభిషేకం చేసేలా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు స్వామివారికి అలంకరణ, అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం వేకువ జామున 3 గం టలకు శివపార్వతుల కల్యాణం, స్వామివారి ప్రాకార పల్లకి సేవ, ఉదయం 10 గంటలకు పూర్ణాహుతి చేపట్టనున్నారు. కాగా గట్టుపైకి వచ్చే భక్తులందరికీ దిన్నెదేవరపాడుకు చెందిన దివంగత పెరుగు సీతారామిరెడ్డి కుమారుల ఆధ్వ ర్యంలో నిరంతర ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

హరిహర క్షేత్రంలో.. నగరంలోని సంకల్‌బాగ్‌లో తుంగభద్ర నది ఒడ్డున వెలసిన హరిహర క్షేత్రంలోని భవానీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం లో శనివారం, ఆదివారం నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవ ాలు నిర్వహించనున్నారు. శనివారం శివరాత్రి పర్వదిన సందర్భంగా స్వామి వారికి ప్రాతఃకాలం నుంచి రుద్రాభిషేకం నిర్వహిస్తారని, రాత్రి లింగోద్భవ కాలంలో భక్తులచే అభిషేకాలు ఏర్పాటు చేసినట్లు బ్రాహ్మణ సంఘం నగర అధ్యక్ష, కార్యదర్శులు కల్లే చంద్రశేఖర్‌ శర్మ, హెచ్‌కే రాజశేఖరరావు తెలిపారు. ఆదివారం భవానీ సమేత రామలింగేశ్వర స్వామి వారికి అన్నాభిషేకం, సాయం త్రం శివపార్వతుల గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

లలితా పీఠంలో.. పాత నగరంలోని లలితా పీఠంలో ఉదయం 6 గంట లకు గోపూజ, లలితా సుందరేశ్వర స్వామివార్లకు పంచామృతాభిషేకం, బిల్వా ర్చన, మహా మంగళహారతి, ప్రసాద వితరణ, అనంతరం భజన కార్యక్రమాలు ఉంటాయని లలితా పీఠం పీఠాధిపతి మేడా సుబ్రహ్మణ్యం స్వామి తెలిపారు. సాయంత్రం 5 గంటలకు మామిళ్లపల్లి జగన్మోహన శర్మ ఆధ్వర్యంలో లలితా సుందరేశ్వర స్వామి వార్ల కల్యాణం, సాయంత్రం 6 గంటలకు 108 కలశాలతో లలితా సుందరేశ్వర స్వామి వార్లకు అభిషేకం, నందికోళ్ల సేవ ఏర్పాటు చేశారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో 3 కోట్ల 12 లక్షల ఒత్తులతో ఆకాశ శివ మహాజ్యోతి వెలిగించనున్నారు. రాత్రి ఒంటి గంటకు భక్తులచే బిల్వార్చన, 2 గంటలకు భస్మాభిషేకం, తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల వరకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ వారిచే హరికథా కార్యక్రమాలు ఏర్పాటు చేశా రు. నగర భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా లలితా పీఠంలో 24 అడుగుల ఎత్తులో మహా శివలింగం ప్రతిమను ఏర్పాటు చేశారు.

నగరేశ్వర ఆలయంలో.. నగరంలోని పురాతన దేవాలయం, తుంగభద్ర ఒడ్డునగల వింద్యా శిఖామణి సమేత నగరేశ్వర ఆలయంలో శివరాత్రి సంద ర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, స్వామివారికి, అమ్మవారికి కల్యాణోత్సవం నిర్వహి స్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అలాగే స్థానిక బి.క్యాంపు లోని శం కరమందిరం, చిదంబరరావు వీధిలోని శంకర మఠంలో శివరాత్రిని పురస్క రించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే అశోక్‌నగర్‌లోని ఆంజనే యస్వామి, ద్వారకామాయి సాయిబాబా దేవస్థానంలోని శివాలయంలో, కప్పల్‌నగర్‌ రోడ్డులోని మల్లికార్జున స్వామి దేవాలయంలో, అశోక్‌నగర్‌ కేసీ కెనాల్‌ సమీపంలోని శివరామాలయంలో, పాత నగరంలోని రంగరాజ వీధిలోని శివాలయంలో, జడ్పీలోని శివాలయంలో, కిసాన్‌ ఘాట్‌లోని సంగమేశ్వర ఆల యంలో శివరాత్రి సందర్భంగా బిల్వార్చనలు, కుంకుమార్చనలు, రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

శివరాత్రికి కాల్వబుగ్గ ఆలయం ముస్తాబు

ఓర్వకల్లు: మండలంలోని కాల్వబుగ్గ రామేశ్వరస్వామి ఆలయం మహాశివ రాత్రి వేడుకలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా ఆలయాన్ని విద్యుద్దీపాలం కరణతో అలంకరించారు. శనివారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

బుగ్గ రామేశ్వరుడికి ప్రత్యేక పూజలు: మండలంలోని కాల్వ గ్రామంలో బుగ్గ రామేశ్వర స్వామికి శుక్రవారం ప్రత్యేక పూజలు జరిపారు. చైర్మన్‌ గుర్రాల చెన్నారెడ్డి, ఆలయ ఈవో డీఆర్‌కేవీ ప్రసాద్‌, ఆలయ అర్చకులు కల్లె లక్ష్మీనా రాయణ శర్మ ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారి విగ్రహాలకు గ్రామాల్లో గ్రామోత్సవాలు నిర్వహించారు. ఈ విగ్రహాలు కాల్వ గ్రామం నుంచి శనివారం ఉదయం 11 గంటలకు కాల్వబుగ్గ దేవాలయానికి చేరుకోనున్నాయి.

Updated Date - 2023-02-18T00:27:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising