ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

ABN, First Publish Date - 2023-05-31T23:56:21+05:30

విజన్‌ ఉన్న నాయకుడు నారా చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు.

గంగవరంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శిరివెళ్ల, మే 31: విజన్‌ ఉన్న నాయకుడు నారా చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. మండలంలోని గంగవరం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు చెన్నారెడ్డిగారి మదన్‌ మోహన్‌రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందడంతో ఆయన కుటుంబ సభ్యులను అఖిలప్రియ బుధవారం పరామర్శించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భూమా అభిమానులకు తాము ఎళ్లవేళలా అండగా ఉంటామన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నాలుగేళ్లుగా ప్రజలపై పన్నుల భారం మోపిన వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మహానాడు వేదికగా ప్రవేశపెట్టిన టీడీపీ మినీ మేనిఫెస్టోపై ప్రజలు, నిరుద్యోగులు, మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. టీడీపీ మండల కన్వీనర్‌ కాటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మురళి, చెన్నారెడ్డిగారి జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.

చాగలమర్రి: యువగళం పాదయాత్ర ప్రజలకు భరోసా నింపిందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. బుధవారం రాత్రి మండలంలోని మద్దూరు గ్రామంలో జరిగిన అవదూత కాశీనాయనస్వామి విగ్రహ ప్రతిష్ఠ వేడుకల్లో పాల్గొన్నారు. కలశ స్థాపన, దీక్షాహోమం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సర్పంచ్‌ లక్ష్మీ ఓబులమ్మ, టీడీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్సర్‌బాషా, నాయకులు సుబ్రహ్మణ్యం, అంజి, పుల్లయ్య, ఓబన్న, సుబ్బరాయుడు, షరీఫ్‌, వెంకటసుబ్బయ్య, ఇమామ్‌వలి, ఓబులేసు, మౌళాలి, అనిఫ్‌, గఫార్‌, లక్ష్మీరెడ్డి, కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T23:56:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising