ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇది ధర్మపోరాటం

ABN, First Publish Date - 2023-10-05T00:14:59+05:30

రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ ధర్మపోరాటం సాగిస్తోందని టీడీపీ నాయకులు అన్నారు.

చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా దీక్షలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి, వాల్మీకి బోయ టీడీపీ సంఘం నాయకులు

వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయి

జగన క్రూరపాలనతో ప్రజలు విసిగిపోయారు

22వ రోజు దీక్షల్లో టీడీపీ నాయకులు

నంద్యాల, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ ధర్మపోరాటం సాగిస్తోందని టీడీపీ నాయకులు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం 22వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కొనసాగాయి. నంద్యాల పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ దీక్షను మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇనచార్జి భూమా బ్రహ్మానందరెడ్డి దీక్షను ప్రారంభించారు. టీడీపీ క్రిస్టియన సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామిదాసు, క్రిస్టియన సెల్‌ రాష్ట్ర నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. వీరితో పాటు హిజ్రాలు కూడా దీక్షలకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదికను కూల్చి విధ్వంసానికి నాంది పలికిందని అన్నారు. అది చంద్రబాబు అక్రమ అరెస్టుతో పరాకాష్ఠకు చేరిందన్నారు. బనగానపల్లె పట్టణంలో టీడీపీ వాల్మీకి బోయ సంఘం నాయకులు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ మాట్లాడుతూ జగనమోహనరెడ్డి అఽధికారంలోకి వచ్చినప్పటినుంచి భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. ఆళ్లగడ్డలో మాజీ మంత్రి అఖిలప్రియ నివాసం ముందు రుద్రవరం మండల టీడీపీ నాయకులు నిరాహర దీక్ష చేపట్టారు. దీక్షను సందర్శించి సంఘీభావం తెలిపిన అఖిలప్రియ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. పాణ్యం నియోజకవర్గంలోని టీడీపీ కార్యాలయం వద్ద పాణ్యం, గడివేముల, ఓర్వకుల్లు, కల్లూరు మండలాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రవ్యాప్తంగా పెల్లుబికిన నిరసనల సందర్భంగా చేపట్టిన దీక్షలతో కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపిందని, ఈ నెల 9 వరకు దీక్షలు కొనసాగుతాయన్నారు. డోన పట్టణంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు నిరసన దీక్షలు చేపట్టాయి. ఈ సందర్భంగా డోన ఇనచార్జి ధర్మవరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ దొంగ కేసులు పెట్టి తమ అధినేత చంద్రబాబు నాయుడును దెబ్బతీయాలని ప్రభుత్వం చూస్తోందని అన్నారు.

బాబు కోసం పోరు

ఫ టీడీపీ అధినేతకు మద్దతుగా కొనసాగుతున్న రిలే దీక్షలు

ఫ జిల్లా వ్యాప్తంగా నిరసనల వెల్లువ

కర్నూలు, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అండగా ఉక్కు సంకల్పంతో టీడీపీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. తమ అభిమాన నేత చంద్రన్న కోసం కార్యకర్తలు, అభిమానులు రెట్టింపు ఉత్సాహంతో ర్యాలీలు, దీక్షలతో సత్తా చాటుతున్నారు. బుధవారం కర్నూలు నగరం శ్రీకృష్ణదేవరాయల సర్కిల్‌ ధర్నా చౌక్‌ వద్ద ఆ పార్టీ నియోజకవర్గం ఇనచార్జి టీజీ భరత ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. వివిధ వార్డులకు చెందిన టీడీపీ నాయకులు, తెలుగుమహిళా కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా టీజీ భరత మాట్లాడుతూ ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు కావాలని, బాబు అరెస్టుపై ప్రజలు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. ఆ పార్టీ నగర్‌ అధ్యక్షుడు నాగరాజుయాదవ్‌, తెలుగుయువత అధ్యక్షుడు అబ్బాస్‌, టీఎనఎస్‌ఎప్‌ అధ్యక్షుడు రాజ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఏపీ గొర్రెల పెంపకందారుల ఫెడరేషన చైర్మన నాగేశ్వరరావు యాదవ్‌ తదితరలు దీక్షా శిబిరానికి చేరుకొని సంఘీభావం తెలిపారు. కోడుమూరులో పార్టీ ఇనచార్జి ఆకెపోగు ప్రభాకర్‌ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొసాగాయి. టీడీపీ నియోజకవర్గం అధికార ప్రతినిధి పి. విజయ్‌కుమార్‌ అధ్యక్షత నాయి బ్రహ్మణ సంఘం నాయకులు దీక్షలో కూర్చున్నారు. కోడుమూరు సర్పంచి భాగ్యరత్న, మండల టీడీపీ కన్వీనర్‌ కోట్ల కవితమ్మ, మాజీ సర్పంచులు సీబీ లత, కేఈ రాంబాబు తదితరులు సంఘీభావం తెలిపారు. ఎమ్మిగనూరు మాచాని సోమప్ప సర్కిల్‌లో 22వ రోజు రిలే దీక్షలను టీడీపీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి దీక్షాధారులైన ఈడిగ సంఘం నాయకులు కొండన్నగౌడ్‌, రంగస్వామి గౌడ్‌, నరసన్న గౌడ్‌ తదితరులు పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బీవీ మాట్లాడుతూ జగన ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో గెలవలేమనే భయంతోనే స్కిల్‌ కేసులో అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టిందని, చివరికి సత్యమే గెలుస్తుందని అన్నారు. అనంతరం వివిధ వార్డుల్లో పర్యటించి బాబు అక్రమ అరెస్టుపై ప్రజలకు వివరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, పట్టణ కార్యదర్శి రంగన్న, సీనియర్‌ నాయకుడు పంపన్నగౌడ్‌ దీక్షా శిబిరానికి చేరుకొని టీడీపీ నాయకుల సంఘీభావం తెలిపారు. మంత్రాలయం రాఘవేంద్ర సర్కిల్‌లో ఆ పార్టీ నియోజకవర్గం ఇనచార్జి పి.తిక్కారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీనివాసరెడ్డి, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి దివాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షల్లో పెద్దకడుబూరు మండలం క్లస్టర్‌, యూనిట్‌ ఇనచార్జిలు కూర్చున్నారు. సీనియర్‌ నాయకులు రమాకాంతరెడ్డి, సాయిబాబా, మండల కన్వీనర్‌ బసలదొడ్డి ఈరన్న హాజరు అయ్యారు.

ఫ ఆదోనిలో వినూత్న నిరసన:

ఆదోనిలో బాబు కోసం మేము సైతం అంటూ టీడీపీ నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ఆ పార్టీ నియోజకవర్గం ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షినాయుడు, సీనియర్‌ నాయకుడు ఉమాపతినాయుడు ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. పార్టీ నాయకులు శరీరాలపై బాబు కోసం మేము సైతం అనే అక్షరాలు రాసుకొని అర్ధనగ్న ప్రదర్శన చేశారు. తెలుగు మహిళలు ర్యాలీ నిర్వహించారు. సంతకాలు సేకరణ సహా చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఉమాపతినాయుడు ఆధ్వర్యంలో ప్రధాన వీధుల్లో రకపత్రాలు పంపిణీ చేశారు. ఆలూరులో బస్టాండ్‌ సర్కిల్‌లో నియోజకవర్గం టీడీపీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ అంబేడ్కర్‌ సర్కిల్‌లో కోట్ల సుజాతమ్మ నాయకత్వంలో టీడీపీ నాయకులు ఉరి వేసుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు నారాయణరెడ్డి, వడ్డె పెద్దయ్య, నారాయణ, అశోక్‌యాదవ్‌, పరమరెడ్డి తదితరులు హాజరయ్యారు. పత్తికొండ నాలుగు స్తంభాల కూడలిలో పార్టీ ఇనచార్జి కేఈ శ్యాంబాబు ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. టీడీపీ నాయకుడు, న్యాయవాది సరేశ కుమార్‌, సింగం శ్రీనుల నాయకత్వంలో 20 మంది దీక్షలో కూర్చున్నారు. మోకాళ్లపై ఆర్థనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. పాణ్యంలో ఆ పార్టీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితమ్మ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు రిలే దీక్షలు చేపట్టారు.

Updated Date - 2023-10-05T00:14:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising