ISRO: ఎల్‌వీఎం3-ఎం3 రాకెట్‌ ప్రయోగం సిద్ధం

ABN, First Publish Date - 2023-03-24T21:20:45+05:30

ఎల్‌వీఎం3-ఎం3 రాకెట్‌ ప్రయోగానికి ఇస్రో (ISRO) సిద్ధమైంది. తిరుపతి జిల్లా (Tirupati District) శ్రీహరికోటలోని షార్‌ రెండో ప్రయోగ వేదిక నుంచి

ISRO: ఎల్‌వీఎం3-ఎం3 రాకెట్‌ ప్రయోగం సిద్ధం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సూళ్లూరుపేట: ఎల్‌వీఎం3-ఎం3 రాకెట్‌ ప్రయోగానికి ఇస్రో (ISRO) సిద్ధమైంది. తిరుపతి జిల్లా (Tirupati District) శ్రీహరికోటలోని షార్‌ రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 26న ఈ రాకెట్‌ ద్వారా వన్‌వెబ్‌ ఇండియా-2 పేరుతో 36 కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలను ఏకకాలంలో కక్ష్యలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ సమావేశం శుక్రవారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌ హాలులో జరిగింది. ఎంఆర్‌ఆర్‌ చైర్మన్‌ బీఎన్‌ సురేష్‌ (MRR Chairman BN Suresh) ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగంపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశానంతరం షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌ అధ్యక్షతన లాంచింగ్‌ ఆథరైజేషన్‌ బోర్డు(ల్యాబ్‌) సమావేశమై ప్రయోగానికి సంసిద్ధత తెలిపింది. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ శనివారం ఉదయం 8.30గంటలకు ప్రారంభం కానుంది. ఇరవై నాలుగున్నర గంటల తరువాత అంటే ఆదివారం ఉదయం 9 గంటలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం3-ఎం3 రాకెట్‌ నింగిలోకి ఎగరనుంది. ఇస్రోలో అంతర్భాగంగా ఉన్న న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌) కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఇస్రో ఈ వాణిజ్య రంగ ప్రయోగం చేపట్టతోంది. 5806 కిలోల బరువైన 36 ఉపగ్రహాలను ఎల్‌వీఎం3-ఎం3 రాకెట్‌ కక్ష్యలోకి చేర్చనుంది. రాకెట్‌ భూమి నుంచి ఎగిరిన 19.7 నిమిషాల్లో 36 ఉపగ్రహాలను లియో ఎర్త్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనుంది. మూడు దశలు కలిగిన ఎల్‌వీఎం3-ఎం3 రాకెట్‌ 43.5 మీటర్ల పొడవు, 4.4 మీటర్ల వెడల్పు, 643 టన్నులు బరువు కలిగి ఉంటుంది. మొదటి దశలో 200 టన్నుల బరువు గల ఘన ఇంధన ఎస్‌-200 స్ట్రాఫాన్‌ బూస్టర్లను కలిగి ఉంటుంది. రెండో దశలో ఎల్‌-110 కోర్‌ దశగా పిలిచే ఈ దశలో 110 టన్నుల ద్రవ ఇంధనం కలిగి ఉంటుంది. మూడో దశలో సీ-25 అతిశీతల క్రయోజనిక్‌ ఇంధనం 25 టన్నుల బరువు కలిగి ఉంటుంది. ఘన, క్రయో ఇంధనాన్ని ఇప్పటికే నింపి ఉంచారు. ద్రవ ఇంధనాన్ని మాత్రం కౌంట్‌డౌన్‌ జరిగే సమయంలో నింపి రాకెట్‌లోని అన్ని దశల ఎలక్ర్టానిక్స్‌ వ్యవస్థల పనితీరుతో పాటు గ్లోబల్‌ పరీక్షలు నిర్వహించి ఏవైన లోటుపాట్లు ఉంటే సరిచేసి రాకెట్‌ను ప్రయోగానికి సిద్ధం చేస్తారు.

Updated Date - 2023-03-24T21:20:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising