బస్సుయాత్రను విజయవంతం చేయండి
ABN, First Publish Date - 2023-08-12T23:44:39+05:30
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అరాచక పాలన నుంచి రాషా్ట్రన్ని రక్షించంని 17వ తేదీ నుంచి నిర్వహించే సీపీఐ బస్సుయాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జాఫర్ పిలుపునిచ్చారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్
రాయదుర్గంరూరల్, ఆగస్టు 12: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అరాచక పాలన నుంచి రాషా్ట్రన్ని రక్షించంని 17వ తేదీ నుంచి నిర్వహించే సీపీఐ బస్సుయాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జాఫర్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని ఏపీ ఎనజీఓ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 17 నుంచి సెప్టెంబర్ 8 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ బస్సుయాత్ర నిర్వహిస్తూ బహిరంగసభలు, సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సీపీఐ తాలూకా ప్రధాన కార్యదర్శి నాగార్జున, పట్టణ ప్రధాన కార్యదర్శి కొట్రేష్, గురుస్వామి, కార్యదర్శి గౌస్‌పీరా, నరసింహులు, తిప్పేస్వామి, దుర్గన్న, నాగరాజు, మహిళా నాయకురాలు పార్వతి పాల్గొన్నారు.
ప్రజల్లో చైతన్యం కోసం సీపీఐ బస్సు యాత్ర
కంబదూరు(కళ్యాణదుర్గం): ప్రజల్లో చైతన్యం కోసం సీపీఐ ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జాఫర్ అన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కార్యదర్శి గోపాల్, రైతు సంఘం కార్యదర్శి నరసింహులు, పట్టణ కార్యదర్శి ఓంకార్, బుడేన, రామాంజనేయులు, హనుమంతరాయుడులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేశాన్ని బీజేపీ, మోదీ నుంచి కాపాడుకోవడానికి ఏపీలో జగన్ నిరంకుశ పాలన నుంచి ప్రజలను రక్షించుకుందామనే నినాదంతో సీపీఐ ఆధ్వర్యంలో 17 నుంచిసెప్టెంబరు 8 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్ర ప్రారంభిస్తున్నామన్నారు. కేంద్రంలో 9 సంవత్సరాల కిందట అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యత స్వీకరించాక పేద ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బందు లు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, కడప ఉక్కు, పోలవరం ప్రాజెక్టులు రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులు ఇవన్నీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడన్నారు. ప్రజా సమస్యలపై సీపీఐ చేపట్టే బస్సు యాత్ర జిల్లాలో సెప్టెంబరు 3, 4 తేదీల్లో రోడ్ షో, బహిరంగ సభ వుంటాయని వెల్లడించారు.
Updated Date - 2023-08-12T23:44:39+05:30 IST