Minister Botsa : జోనల్ వ్యవస్థ, స్థానికత అంశాలపై కసరత్తు!
ABN, First Publish Date - 2023-04-13T02:59:06+05:30
జోనల్ వ్యవస్థ, స్థానికత అంశాలపై రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ విషయమై బుధవారం అమరావతి సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశమైంది.
అమరావతి, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): జోనల్ వ్యవస్థ, స్థానికత అంశాలపై రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ విషయమై బుధవారం అమరావతి సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశమైంది. ఆ వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ని జోన్లు ఉన్నాయి? ఏఏ జోన్లలో ఏమేమి ఉన్నాయి? స్థానికతకు నిర్వచనం ఏమిటి? అనేవాటిపై చర్చించి ఒక డ్రాఫ్ట్‌ను సిద్ధం చేశామని బొత్స తెలిపారు. దీనికి తుది మెరుగులు దిద్ది, ఉద్యోగ సంఘాలతో కూడా చర్చిస్తామన్నారు. ఆ తర్వాత కేబినెట్ ముందు ఉంచుతామని చెప్పారు. సచివాలయ రెండో బ్లాక్‌లో జరిగిన ఈ భేటీలో సీఎస్ జవహర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-13T02:59:06+05:30 IST