ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎమ్మెల్యే కూతురు పిలుస్తోందని తీసుకెళ్లి...!

ABN, First Publish Date - 2023-11-14T01:33:16+05:30

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి కుమార్తె పవిత్రా రెడ్డి పిలుస్తోందంటూ తీసుకెళ్లి చితకబాదడంతో తన చెవులు, తలలో నరాలు దెబ్బతిన్నాయంటూ ఓ మాజీ ఎంపీటీసీ సభ్యుడు తిరుపతిలో చికిత్స పొందుతున్నాడు.

చీకటి వేణు వద్ద ఫిర్యాదు నమోదు చేసుకుంటున్న హెడ్‌కానిస్టేబుల్‌ రవి

మాజీ ఎంపీటీసీని చితకబాదారు

తలలో నరాలు దెబ్బతిన్నాయంటూ

ఏరియా ఆస్పత్రిలో చేరిన బాధితుడు

శ్రీకాళహస్తి, నవంబరు 13 : శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి కుమార్తె పవిత్రా రెడ్డి పిలుస్తోందంటూ తీసుకెళ్లి చితకబాదడంతో తన చెవులు, తలలో నరాలు దెబ్బతిన్నాయంటూ ఓ మాజీ ఎంపీటీసీ సభ్యుడు తిరుపతిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి కథనం మేరకు... తొట్టంబేడు మండలం దొంగల ముడూరుకు చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు,దళిత సామాజికవర్గానికి చెందిన చీకటి వేణు వ్యవసాయంతో జీవనం సాగిస్తుంటారు. రెండేళ్ల కిత్రం నాయుడుపేట- రేణిగుంట ఆరు లేన్ల జాతీయ రహదారి పనులను మెగా సంస్థ ప్రారంభించింది. వారికి మట్టి అవసరం కావడంతో తొట్టంబేడు మండలం శివనాధపురం, బుచ్చినాయుడు కండిగ్ర మండలం పార్లపల్లి ప్రాంతాల్లో రైతుల భూముల నుంచి వేణు మట్టి సరఫరా చేసేవాడు.రోడ్డు నిర్మాణ సంస్థలో ఉద్యోగిగా పని చేసే తేజరెడ్డితో ఆర్థిక లావాదేవీల విషయంలో వేణుకు విభేదాలు వచ్చాయి. దాంతో తనకు న్యాయం చేయాలని వేణు మెగా సంస్థ ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లాడు. దాంతో వేణుపై తేజరెడ్డి ఆగ్రహించాడు.ఈ నేపథ్యంలో గత నెల 23వ తేది రాత్రి 8గంటల సమయంలో వేణు శ్రీకాళహస్తి పట్టణ శివారు చెన్నై రోడ్డులోని సాయిబాబా ఆలయ ప్రాంతానికి వచ్చాడు. తొట్టంబేడు గ్రామానికి చెందిన వెంకి, శివనాధపాళేనికి చెందిన నరేష్‌ వేణు వద్దకు. వచ్చి ఎమ్మెల్యే కూతురు పవిత్రారెడ్డి పిలుస్తోందని, వెంటనే రమ్మని చెప్పారు. పట్ట్టణంలోని వీఎంసీ కూడలి సమీపంలో ఉన్న ద్వారకానగర్‌ ప్రాంతానికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే కుమార్తె ఇల్లు అక్కడే ఉండడంతో వేణు వారి మాటలు నమ్మి వెళ్లాడు. అయితే అప్పటికే అక్కడ తేజరెడ్డి ఉన్నాడు. అతని వెంట తొట్టంబేడు మండలం గుండేలు గుంటకు చెందిన రవిరెడ్డి, అదే మండలానికి చెందిన నాగరాజు ఉన్నారు. మొదట నాగరాజు రావడం రావడమే వేణు గూబమీద కొట్టాడు. ఎందుకు ఇలా కొడుతున్నారని అడుగుతుండ గానే రవిరెడ్డి కొట్టాడు. ఇలా అక్కడ ఉన్నవారంతా మార్చి మార్చి వేణూను కొట్టారు. మధ్యలో దెబ్బలు తాళలేక సొమ్మసిల్లి పడిపోతే ముఖంపై నీళ్లు పోసి లేపి మళ్లీ కొట్టారు. సుమారు గంట సేపు ఇలా చితకబాదారు.ఎమ్మెల్యే కుమారుడు అటు వెళ్తూ గమనించి వారిని అడ్డుకోవడంతో విడిచిపెట్టారు. దాడి చేసిన పరిసరాల్లో సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. మొదట కొట్టారన్న అవమానంతో ఎవరికీ చెప్పుకోలేక అదే రోజు పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో వేణు చేరాడు. అయితే చెవుల కింది భాగాలు లోపల బాగా దెబ్బతిన్నట్టు , మెదడులో నరాలు దెబ్బతిన్నట్టు వైద్యులు చెప్పడంతో 25వ తేదిన చికిత్స నిమిత్తం, పోలీసులకు ఫిర్యాదు అందించేందుకు శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేరాడు. మెడికో లీగల్‌ కేసు (ఎమ్మెల్సీ)సమాచారంతో పోలీసులు ఆస్పత్రివద్దకు చేరుకొని వేణు వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం తిరుపతిలోని ఓ ప్రైవేటు న్యూరో వైద్యశాలలో వేణు చికిత్స పొందుతున్నాడు. తనపై జరిగిన దాడికి సంబంఽధించి స్పష్టంగా సీసీ కెమెరాల్లో రికార్డయి ఉంటుందని, అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని వేణు కోరుతున్నాడు. తన ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది కాబట్టి వైద్య ఖర్చులకు సహాయం చేయాలని కోరుతున్నాడు.

ఫిర్యాదు చేసేందుకు కూడా రాలేదు

తనపై దాడి చేసి గాయపరిచారంటూ చీకటి వేణు అనే వ్యక్తి గత నెల 25వ తేది ప్రభుత్వాస్పత్రిలో చేరాడు. ఆస్పత్రి నుంచి సమాచారం తెలిసిన వెంటనే 2వ పట్టణ పోలీసులు అతని వద్దకు వెళ్లారు.రెండు రోజుల కిత్రం దాడి జరిగినట్టు వేణు చెప్పడంతో అతని వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నాం. ఆస్పత్రి నుంచి వచ్చిన వెంటనే ఫిర్యాదు అందించాలని తెలిపాం, కానీ ఇప్పటి వరకూ ఆయన రాలేదు.

- మల్లిఖార్జున్‌, టూటౌన్‌ సీఐ,శ్రీకాళహస్తి

Updated Date - 2023-11-14T01:33:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising