Nagababu: జగన్‌ ప్రభుత్వంపై నాగబాబు సెటైర్లు

ABN, First Publish Date - 2023-01-22T19:23:09+05:30

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో... పాలన కూడా అలాగే ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు (Nagababu) సెటైర్లు వేశారు. ఆదివారం ఆయన అనంతపురం వచ్చారు.

Nagababu: జగన్‌ ప్రభుత్వంపై నాగబాబు సెటైర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో... పాలన కూడా అలాగే ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు (Nagababu) సెటైర్లు వేశారు. ఆదివారం ఆయన అనంతపురం వచ్చారు. ముందుగా... అనంతపురం నగరంలోని చెరువుకట్ట రోడ్డును పరిశీలించారు. ఆ రోడ్డుపై ఏర్పడిన గుంతలను నాగబాబుతో మట్టి వేయించి, పూడ్పించాలని స్థానిక నాయకులు ముందురోజే ఏర్పాట్లు చేసుకున్నారు. విషయాన్ని గమనించిన అధికారులు ఆగమేఘాల మీద ఆ రోడ్డు మరమ్మతులు చేపట్టారు. దీంతో నాగబాబు ఆ రోడ్డును పరిశీలించడంతో సరిపెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో నాగబాబు మాట్లాడుతూ జనసైనికులు రోడ్లు వేస్తామన్నారో.. లేదో... వైసీపీ ప్రభుత్వం వెంటనే మరమ్మతులు మొదలుపెట్టడం అభినందనీయమన్నారు. ఇటీవలే వైజాగ్‌లో తమ పార్టీ అధినేత పవన్‌‌కల్యాణ్‌ (Pawan Kalyan)తో పాటు నాయకులను అనేక ఇబ్బందులు పెట్టారన్నారు. అయినా పార్టీ చేపట్టిన కార్యక్రమాలు ఏవీ ఆగలేదన్నారు. ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు ఎన్ని ఇబ్బందులు సృష్టించినా తాము చేయాల్సిన పని చేసి తీరతామన్నారు. సమావేశాలు నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం1ను జారీ చేస్తే... హైకోర్టు (High Court) మొట్టికాయ వేసిందని గుర్తుచేశారు. పోలీసులు, ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. పార్టీ కార్యక్రమాలు ఆగవని నాగబాబు స్పష్టం చేశారు.

Updated Date - 2023-01-22T19:23:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising