కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nara Brahmani : ఏది నేరం..?

ABN, First Publish Date - 2023-09-17T02:34:11+05:30

‘‘ఏది నేరం? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం నేరమా? స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం నేరమా? నీతిగా నిజాయితీగా పాలన

Nara Brahmani  : ఏది నేరం..?

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమా?

యువతకు స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ద్వారా ఉపాధి కల్పించడమా?

చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి వ్యాఖ్యలు

రాజమహేంద్రవరం సిటీ/రూరల్‌ సెప్టెంబరు 16: ‘‘ఏది నేరం? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం నేరమా? స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం నేరమా? నీతిగా నిజాయితీగా పాలన సాగించడం నేరమా? చంద్రబాబు చేసిన నేరం ఏంటి?’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు కోడలు, నారా లోకేశ్‌ సతీమణి నారా బ్రాహ్మణి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో శనివారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బ్రాహ్మణి పాల్గొన్నారు. రామాలయం సెంటర్‌లో బ్రాహ్మణి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం చంద్రబాబుపై ఎలాంటి ఆధారాలూ లేని కేసు పెట్టి అక్రమంగా అరెస్టు చేసిందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. హైదారాబాద్‌కు ఐటీని తీసుకువచ్చి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించారని, నిరంతరం ప్రజాసంక్షేమం కోసం పాటుపడ్డారన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా లక్షలాదిమంది యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు వచ్చేలా చేశారని, ఇవి చేయడం నేరమా? అని ప్రశ్నించారు. రేపు లోకేశ్‌ను అరెస్ట్‌ చేసినా భయపడే ప్రసక్తే లేదన్నారు. చంద్రబాబు నిర్దోషిగా బయటకు వస్తారన్నారు. ‘‘ఏరోజూ మా అత్త భువనేశ్వరి బయటకు రాలేదు. ఈరోజు వచ్చారు. ఎంతోమంది మహిళలు మాకు మద్దతుగా బయటకు వచ్చారు. నా భర్త ఒక చోట, నేను ఒకచోట, మా కుమారుడు మరో చోట ఉన్నామనే బాధ ఉన్నా రాష్ట్ర ప్రజలంతా మా కుటుంబ సభ్యులేననే ధైర్యం ఉంది’’ అని బ్రాహ్మణి వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-09-17T02:34:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising