ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nara Lokesh : జయహో బీసీ!

ABN, Publish Date - Dec 30 , 2023 | 02:58 AM

రాష్ట్రవ్యాప్తంగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు జనవరి 4నుంచి ‘జయహో బీసీ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ వెల్లడించారు.

బడుగుల కోసం ప్రత్యేక మేనిఫెస్టో: లోకేశ్‌

జనవరి 4 నుంచి పార్లమెంటు, అసెంబ్లీ

స్థానాలు, మండల స్థాయిలో సమావేశాలు

అమరావతి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు జనవరి 4నుంచి ‘జయహో బీసీ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ వెల్లడించారు. శుక్రవారమిక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, పితాని సత్యనారాయణ, బీసీ రాష్ట్ర నేత గురుమూర్తి తదితరులతో కలిసి ఆయన ‘జయహో బీసీ’ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జయహో కార్యక్రమ నిర్వహణపై చంద్రబాబు నేతృత్వంలో వర్క్‌షాపు ఏర్పాటు చేస్తామన్నారు. 4 నుంచి పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండల స్థాయుల్లో సమావేశాలు నిర్వహిస్తామని, తర్వాత రాష్ట్ర స్థాయిలో భారీ సభ ఏర్పాటుచేసి బీసీలకు మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించామని వివరించారు. యువగళం పాదయాత్రలో బీసీలు పడుతున్న ఇబ్బందులు ప్రత్యక్షంగా తెలుసుకున్నానని, తాను తిరగని మండలాల్లో కూడా జయహో బీసీ ద్వారా సమస్యలు తెలుసుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. బీసీలకు టీడీపీ పుట్టినిల్లని, 1982లోనే ఎన్టీఆర్‌ బీసీలకు సీట్లతో పాటు పలు మంత్రి పదవులు ఇచ్చి సత్కరించారని గుర్తుచేశారు. అప్పట్లో బీసీలకు స్థానిక సంస్థల్లో 24 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తే చంద్రబాబు 34 శాతానికి పెంచారని గుర్తు చేశారు. అయితే జగన్‌ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 10శాతం తగ్గించి అన్యాయం చేసిందన్నారు.

టీడీపీ హయాంలో బీసీల కోసం రూ.36వేల కోట్లు ఖర్చు చేశామని, బీసీ కార్పొరేషన్‌ ద్వారా రూ.3వేల కోట్లు, ఆదరణ ద్వారా రూ.1,000 కోట్లు వ్యయం చేశామని.. బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లు, విదేశీ విద్య, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి ఎన్నో పథకాలు బీసీల కోసం అమలు చేశామని తెలిపారు. బీసీలు వైసీపీకి బ్యాక్‌బోన్‌ అంటూనే జగన్‌ వారి వెన్నువిరిచే కార్యక్రమాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. జగన్‌ ప్రభుత్వ అరాచకాలపై బీసీల్లో చైతన్యం తీసుకు రావలసిన అవసరముందని.. వారి రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తామని, కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా నూతన టెక్నాలజీతో శాశ్వత కుల ధ్రువీకరణ పత్రం ఇస్తామని.. ఉపకులాల వారీగా నిధులు కేటాయించి ఆ నిధులను వారి స్వయంఉపాధి, సంక్షేమ కోసం ఖర్చు చేస్తామని హామీలి చ్చారు. బీసీలకు కమ్యూనిటీ భవనాలు, విదేశీ విద్య, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ పునరుద్దరిస్తామన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు తగ్గించిన రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామని చెప్పారు. 2నెలల పాటు నిర్వహించే జయహో బీసీ కార్యక్రమం ద్వారా వారి సమస్యలు తెలుసుకుని పూర్తి స్థాయిలో వారికి భరోసా ఇస్తామని లోకేశ్‌ చెప్పారు.

ఓడే సీట్లు బీసీలకా?

ఓడిపోయే సీట్లు బీసీలకు ఇచ్చి జగన్‌ మభ్యపెడుతున్నారని.. గెలుస్తారనుకుంటున్న పులివెందుల ఎమ్మెల్యే, కడప ఎంపీ సీట్లు బీసీలకు ఎందుకు ఇవ్వడం లేదని లోకేశ్‌ ప్రశ్నించారు. గెలిచే సీట్లు తన సామాజికవర్గానికి ఇచ్చి, ఓడిపోయే సీట్లు బీసీలకు ఇస్తున్నారన్నారు. అప్పుడు, ఇప్పుడు బీసీలకు ప్రాధాన్యమిచ్చింది టీడీపీయేనని చెప్పారు. వైసీపీ హయాం లో ఒక్క బీసీకి రుణం ఇచ్చినట్లు చెప్పగలరా అని ప్రశ్నించారు. డాక్టర్‌ సుధాకర్‌, డాక్టర్‌ అచ్చెన్న, ఓంప్రతాప్‌, అనితారాణిలపై దాడిచేస్తుంటే ఏంచేశారని నిలదీశారు. హోం మంత్రి సొంత నియోజకవర్గంలో దళిత యువకుడిని చంపుతుంటే ఏమీ చేయలేకపోయారని, ఇలాంటి పరిస్థితుల్లో సామాజిక బస్సు యాత్రలతో ఉపయోగమేముందని నిలదీశారు. బటన్‌పై తనకే పేటెంట్‌ ఉన్నట్లుగా జగన్‌ బిల్డప్‌ ఇస్తున్నారని, దానిని ఆయన కనిపెట్టాడా అని లోకేశ్‌ ఎద్దేవా చేశారు.

నేతన్నల అభ్యున్నతికి నాదీ బాధ్యత

నేతన్నల అభ్యున్నతిని బాధ్యతగా తీసుకుని, చేనేతలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మెరుగైన స్థితిలో నిలపడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తానని లోకేశ్‌ హామీ ఇచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చేనేత కార్మికులు, చేనేత సామాజికవర్గ నాయకులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘చేనేతల ఆదాయం పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తాం. ఉద్యోగులు, కార్మికులతో కమిటీని ఏర్పాటు చేసి, దేశమంతా పరిశీలించి, మెరుగైన కార్యాచరణ రూపొందిస్తాం. హ్యాండ్‌లూమ్‌, పవర్‌లూమ్‌ను వేర్వేరుగా అభివృద్ధి చేయడానికి ఉన్న మార్గాలు పరిశీలించి, ప్రోత్సాహం అందిస్తాం’ అని తెలిపారు. రాష్ట్ర చేనేతకు ప్రపంచస్థాయిలో ఆదరణ పెంచాలని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కోరారు. గతంలో ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన జనతా వస్త్రాల పథకం రాష్ట్ర చేనేతకు స్వర్ణయుగం తెచ్చిందని.. దానిని మళ్లీ తీసుకొస్తేనే నేతన్నలు అభివృద్ధి పథంలో పయనిస్తారని పలువురు అభిప్రాయపడ్డారు. సమ్మేళనంలో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, కంది వెంకట ప్రసాద్‌, బొడ్డు వేణుగోపాల్‌, వీరంకి గురుమూర్తి, వాసంశెట్టి సత్య, సజ్జా హేమలత, కాండ్రు శ్రీనివాస్‌, తమ్మిశెట్టి జానకీదేవి, దొంతు చిన్న, గుత్తికొండ ధనుంజయ తదితరులు ప్రసంగించారు.

Updated Date - Dec 30 , 2023 | 02:59 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising