ఐఎన్‌ఎస్ డేగాలో నేవల్ యాంటీ డ్రోన్ సిస్టమ్
ABN, First Publish Date - 2023-06-13T03:47:25+05:30
నేవీ వైమానిక స్థావరం ఐఎన్‌ఎస్ డేగాలో కొత్తగా నేవల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ (ఎన్‌ఏడీఎస్)- డీ4ను అమలులోకి తీసుకువచ్చారు.
విశాఖపట్నం, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): నేవీ వైమానిక స్థావరం ఐఎన్‌ఎస్ డేగాలో కొత్తగా నేవల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ (ఎన్‌ఏడీఎస్)- డీ4ను అమలులోకి తీసుకువచ్చారు. నేవీకి సంబంధించిన ఎయిర్‌ఫీల్డ్‌లో అనుమానిత డ్రోన్లు ఏమైనా కనిపిస్తే వాటిని గుర్తించి పడగొట్టేందుకు ఈ వ్యవస్థను అభివృద్ధి చేశారు. భారత్ ఎలక్ర్టానిక్స్ లిమిటెడ్ (బెల్) పూర్తి దేశీయ పరిజ్ఞానంతో దీన్ని అభివృద్ధి చేసింది. డ్రోన్లను గుర్తించి, వాటి గమనాన్ని ట్రాక్ చేసి, ఆ తర్వాత వాటిని కూల్చేస్తారు. తూర్పు నౌకాదళ చీఫ్ వైస్ అడ్మిరల్ విశ్వజిత్ దాస్‌గుప్తా సోమవారం దీన్ని ప్రారంభించి, పరిశీలించారు.
Updated Date - 2023-06-13T04:17:55+05:30 IST